నాగార్జున 'మన్మథుడు 2' టీజర్ విడుదల తేదీ
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున హీరోగా మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయ్‌కామ్ 18 స్టూడియోస్ పతాకాలపై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మన్మథుడు 2`. నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) నిర్మాతలు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఒక షెడ్యూల్ మినహా సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. త్వరలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణకు కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన నాగార్జున స్టైలిష్ లుక్‌తో పాటు నాగార్జున- రకుల్, నాగార్జున- కీర్తిసురేష్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా జూన్ 13న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నారు.
మన్మథుడు ఇన్‌స్పిరేషన్‌తో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ ఫన్ రైడర్ తెరకెక్కుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments