'మన్మథుడు 2' షూటింగ్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కింగ్ నాగార్జున కుర్ర హీరోలతో పోటీ పడుతూ హ్యాండ్ సమ్ లుక్లో్ కనపడటమే కాదు.. వారితో పోటీ పడుతూ లిప్‌లాక్‌లు చేస్తున్నాడు. ఇంతకు నాగార్జున లిప్‌లాక్స్ చేస్తూ రెచ్చిపోబోతున్న సినిమా ఏదో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆచిత్రమే `మన్మథుడు 2`. రకుల్ ప్రీత్ సింగ్, కీర్తిసురేశ్ హీరోయిన్స్‌గా నటించారు. సమంత అక్కినేని కీలక పాత్రలో నటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 9న సినిమా విడుదల కానుంది.
17 ఏళ్ల క్రితం విడుదలైన `మన్మథుడు` సినిమా స్ఫూర్తితో `మన్మథుడు2` తెరకెక్కుతోంది. `మన్మథుడు`లో అమ్మాయిలంటే చిరాకు పడే పాత్రలో నాగార్జున కనపడిన సంగతి విదితమే. కానీ అందుకు పూర్తి భిన్నమైన ప్లేబోయ్ పాత్రను `మన్మథుడు 2`లో పోషిస్తున్నారు. ఆ విషయంలో టీజర్‌తోనే అర్థమైంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments