'మ‌న్మ‌థుడు 2' షూటింగ్ పూర్తి

  • IndiaGlitz, [Monday,July 08 2019]

టాలీవుడ్ కింగ్ నాగార్జున కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతూ హ్యాండ్ స‌మ్ లుక్‌లో్ క‌న‌ప‌డ‌ట‌మే కాదు.. వారితో పోటీ ప‌డుతూ లిప్‌లాక్‌లు చేస్తున్నాడు. ఇంత‌కు నాగార్జున లిప్‌లాక్స్ చేస్తూ రెచ్చిపోబోతున్న సినిమా ఏదో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. ఆచిత్ర‌మే 'మ‌న్మ‌థుడు 2'. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, కీర్తిసురేశ్ హీరోయిన్స్‌గా న‌టించారు. సమంత అక్కినేని కీల‌క పాత్ర‌లో న‌టించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. ఆగ‌స్ట్ 9న సినిమా విడుద‌ల కానుంది.

17 ఏళ్ల క్రితం విడుద‌లైన 'మ‌న్మ‌థుడు' సినిమా స్ఫూర్తితో 'మ‌న్మ‌థుడు2' తెర‌కెక్కుతోంది. 'మ‌న్మ‌థుడు'లో అమ్మాయిలంటే చిరాకు ప‌డే పాత్ర‌లో నాగార్జున క‌న‌ప‌డిన సంగ‌తి విదిత‌మే. కానీ అందుకు పూర్తి భిన్న‌మైన ప్లేబోయ్ పాత్ర‌ను 'మ‌న్మ‌థుడు 2'లో పోషిస్తున్నారు. ఆ విష‌యంలో టీజ‌ర్‌తోనే అర్థ‌మైంది. రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు.

More News

రాజుగారిగ‌ది వైపు అవికా చూపు

త‌మ‌న్నా ఉంటే `రాజుగారిగ‌ది 3`పై మంచి హైప్ వ‌స్తుంద‌ని అనుకున్నాడు డైరెక్ట‌ర్ ఓంకార్‌.

అంచనాలు పెంచిన సూర్య బందోబస్త్' టీజర్ 

​​​​​​​తీవ్రవాదం వలన భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు... రైతులు, నది జలాల సమస్యలు... ఇండియన్ ఆర్మీ సీక్రెట్ ఆపరేషన్స్ నేపథ్యంలో రూపొందిన డిఫరెంట్ అండ్

అఖిల్ స‌ర‌స‌న నివేదా

అఖిల్ తాజా చిత్రంలో నాయిక‌గా నివేదాను అనుకుంటున్నారా? ఇటీవ‌ల తెలుగులో ఆమె వ‌రుస చిత్రాల‌ను చూసి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆమెనే ఫిక్స్ చేశారా? అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. 

నాగ్ ఇప్పుడు 5 పెంచాడ‌ట‌

అక్కినేని అంద‌గాడు నాగార్జున గ‌తంలో 7 తీసుకుంటే, ఇప్పుడు 5 పెంచి మొత్తం ప‌న్నెండు తీసుకుంటున్నాడ‌ట‌. బుల్లితెర‌మీద క‌నిపించ‌డానికి ఇంత మొత్త‌మా?  

చ‌రణ్ కి 15, తార‌క్‌కి 25

రామ్‌చ‌ర‌ణ్‌కి రూ.15కోట్లు, తార‌క్‌కి రూ.25కోట్లు అని ఫిక్స్ చేశాడ‌ట రాజ‌మౌళి .ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్‌, తార‌క్ క‌లిసి `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.