‘మన్మథుడు-2’ ఇక్కడ అట్టర్ ప్లాప్.. అక్కడ సూపర్ హిట్!
- IndiaGlitz, [Wednesday,August 14 2019]
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ హీరోహీరోయిన్లుగా ఒకే ఒక్క సినిమాతో హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. ఆగస్ట్-09న ‘మన్మథుడు’గా అభిమానుల ముందుకు వచ్చిన నాగ్ ఆశించింనంత కాదు కదా.. అట్టర్ ప్లాప్ అయ్యాడు. సినిమాలో కాస్త డిఫరెంట్‌గా వయసు మళ్లినా పెళ్లి కాని బ్రహ్మచారి పాత్రలో కనిపించడంతో అభిమానులంతా ఎంతో ఆనంద పడ్డారు. అయితే ఆ ఆనందం థియేటర్‌కు వెళ్లి సీట్లలో కూర్చొని మూవీ చూసి బయటికొచ్చేంత వరకూ లేకపోవడం గమనార్హం. అయితే వరుసగా మూడ్రోజుల పాటు సెలవులు ఉండటంతో కలిసొస్తుందని దర్శకనిర్మాతలు భావించినప్పటికీ.. ‘అనుకున్నదొక్కటి అయినదొక్కటి’గా పరిస్థితి మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాగ్ రేంజ్‌కు అసలు ఈ సినిమా అస్సలు సూటవ్వదు అని చెప్పక తప్పదు మరి.
మొదటి నాలుగు రోజుల్లో కేవలం 8.86 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. ఇది నిజంగా నాగ్‌కు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు. అయితే ఈ దెబ్బను బిగ్‌బాస్ సీజన్-3 హోస్ట్‌గా మాత్రం కవర్ చేసుకుంటున్నాడు. నాగ్ ఇక్కడ మాత్రం సూపర్ హిట్టయ్యాడు. మన్మథుడు లేకపోతే బహుశా ఈ బిగ్‌బాస్‌ను అభిమానులు, ప్రేక్షకులు చూడలేరేమో. మొత్తానికి చూస్తే.. మన్మథుడు-2తో వెండితెరపై అట్టర్ ప్లాప్ అయిన నాగ్.. బుల్లి తెరపై మాత్రం సూపర్ హిట్ అయ్యాడని విమర్శకులు సైతం చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఇదంతా నాగ్.. ఓవర్ కాన్ఫిడెంట్‌తో ఒకే ఒక్క సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడితో చేయడం పెద్ద తప్పు అని అభిమానులు భావిస్తున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నాగ్ అయితే బిగ్‌బాస్‌తో సొమ్ము చేసుకుంటున్నాడు.. మరి దర్శకనిర్మాతల పరిస్థితేంటో పైనున్న పెరుమాళ్లకే ఎరుక. సో.. మున్ముంథు ఈ మన్మథుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో మరి.