'మన్మథుడు 2' కి ఫ్యాన్సీ డిజిటల్
- IndiaGlitz, [Tuesday,July 23 2019]
కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ హీరో, హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం 'మన్మథుడు 2'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్ట్ 9న సినిమా విడుదల కానుంది. కాగా.. ఈ సినిమాపై ఉన్న అంచనాలతో సినిమా డిజిటల్‌కు ఫ్యాన్సీ ప్రైజ్ దక్కిందని సమాచారం. వినపడుతున్న సమాచారం ప్రకారం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు ఏడుకోట్ల రూపాయలకు పైగానే చెల్లించి డిజిటల్ హక్కులను దక్కించుకుందట.
ఈ చిత్రంలో కీర్తిసురేశ్ కీలక పాత్రలోనటించింది. 17 ఏళ్ల క్రితం విడుదలైన 'మన్మథుడు' సినిమా స్ఫూర్తితో 'మన్మథుడు2' తెరకెక్కుతోంది. 'మన్మథుడు'లో అమ్మాయిలంటే చిరాకు పడే పాత్రలో నాగార్జున కనపడిన సంగతి విదితమే. కానీ అందుకు పూర్తి భిన్నమైన ప్లేబోయ్ పాత్రను 'మన్మథుడు 2'లో పోషిస్తున్నారు.