నానికి పోటీగా మంజుల
Send us your feedback to audioarticles@vaarta.com
ఫిబ్రవరి నెల రసవత్తరంగా మారనుంది. ఆ నెలలో ప్రతివారం కూడా.. ఒకే తేదికి రెండు మూడు సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 16న కూడా ఇలా రెండు సినిమాలు రాబోతున్నాయి. ఆ చిత్రాలే అ!, మనసుకు నచ్చింది. విశేషమేమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీస్ కావడం. నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బా, అవసరాల శ్రీనివాస్, మురళీ శర్మ, ప్రియదర్శి ముఖ్య తారాగణంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన అ! చిత్రాన్ని.. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై యువ కథానాయకుడు నాని సమర్పిస్తున్నారు.
కట్ చేస్తే.. సరిగ్గా అదే రోజు, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని తన తొలి దర్శకత్వంలో చేసిన మనసుకు నచ్చిందితో పలకరించబోతున్నారు. సందీప్ కిషన్, అమైరా దస్తర్, త్రిధా చౌదరి నటించిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాణ రంగంలోకి అరంగేట్రం చేస్తూ నాని నిర్మించిన తొలి చిత్రం.. మంజుల దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఒకే రోజున విడుదల కావడం వార్తల్లో నిలిచే అంశమే. మరి వీరిలో ఎవరు బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలుస్తారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments