'మనసుకు నచ్చింది' ట్రైలర్ అందరికీ నచ్చింది - దర్శకురాలు మంజుల ఘట్టమనేని

  • IndiaGlitz, [Wednesday,January 10 2018]

నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొని ఇప్పుడు దర్శకురాలిగా పరిచయమవుతున్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ మంజుల ఘట్టమనేని. సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క అయినప్పటికీ తండ్రి, తమ్ముడి స్టార్ డమ్ ల ఆసరాగా చేసుకొని కాక స్వయంకృషితో ఎదిగిన మహిళ మంజుల ఘట్టమనేని. నటిగా "షో" సినిమాతో ఆశ్చర్యపరిచిన మంజుల నిర్మాతగా "పోకిరి" చిత్రంతో సరికొత్త రికార్డులు సృష్టించారు. ఇప్పుడు దర్శకురాలిగా "మనసుకు నచ్చింది" అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు.

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్-ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్-పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "మనసుకు నచ్చింది". సందీప్ కిషన్-అమైరా దస్తూర్ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫేస్ బుక్/ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. అన్నీ వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన సంపాదించుకొన్న "మనసుకు నచ్చింది" చిత్రం జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. "ట్రైలర్ కి విశేషమైన స్పందన లభించింది. రోమాంటిక్ డ్రామాగా రూపొందిన "మనసుకు నచ్చింది" ట్రైలర్ అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. రాధన్ సంగీత సారధ్యంలో రూపొంది ఇప్పటివరకూ విడుదలైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి జనవరి 26న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం" అన్నారు.

సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి, ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ ఆదిత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాధన్, ఎడిటర్: సతీష్ సూర్య, కళ: హరివర్మ, సినిమాటోగ్రఫీ: రవి యాదవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: పి.కిరణ్-సంజయ్ స్వరూప్, రచన-దర్శకత్వం: మంజుల ఘట్టమనేని.

More News

'కూనిరాగాలు' ఆవిష్కరించిన కళాతపస్వి కె.విశ్వనాధ్

కూనిరెడ్డి శ్రీనివాస్ రాసిన కవితా సంపుటి 'కూనిరాగాలు' ను కళాతపస్వి,దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత కె.విశ్వనాధ్ ఆవిష్కరించారు.

26 ఏళ్ల 'చంటి'

చిన్నప్పట్నుంచి పాటలు,తల్లి,తల్లి ప్రేమ తప్ప మరేమీ తెలియని ఒక అమాయకుడికి..

'లక్కీఫెలో' సినిమా 'లవ్‌లీ' కంటే పెద్ద హిట్‌ అవుతుంది - డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి.

జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి రచయిత్రిగా, 'సూపర్‌హిట్‌' పత్రిక జనరల్‌ మేనేజర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జయ బి, సినిమాల మీద మక్కువతో 'చంటిగాడు' చిత్రంతో దర్శకురాలిగా మారి 'గుండమ్మగారి మనవడు', 'లవ్‌లీ' 'వైశాఖం' లాంటి ఫీల్‌గుడ్‌ మూవీస్‌ని ప్రేక్షకులకందించి దర్శకురాలిగా తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని తెచ్చుకున్నా

'టిక్ టిక్ టిక్‌' టీజ‌ర్ విడుద‌ల‌

జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి చ‌ద‌ల‌వాడ నిర్మాతగా వ‌స్తోన్న   చిత్రం 'టిక్ టిక్ టిక్‌'.

మహానటిలా నేను చేయలేనని అన్నా - కీర్తి

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.