'రంగస్థలం' బ్యూటీ, క్రేజీ సింగర్ జంటగా 'మనిషి'.. ఫస్ట్ లుక్ రిలీజ్

  • IndiaGlitz, [Wednesday,June 09 2021]

నటుడిగా, సింగర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు నోయల్. నోయెల్ గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. తాజాగా నోయల్ నుంచి ఓ ఆసక్తికర ప్రకటన వచ్చింది. నోయెల్ హీరోగా నటిస్తున్న మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మూవీ టైటిల్ 'మనిషి'.

ఇదీ చదవండి: యంగ్ డైరెక్టర్ కు మైత్రి బంపర్ ఆఫర్.. రాంచరణ్ తో మూవీ!

ఫస్ట్ లుక్ లో నోయెల్ సిగరెట్ కాల్చుతూ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. నోయెల్ లుక్ తో పాటు, టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉంది. 'మని' అంటే డబ్బు.. 'షి' అంటే లేడీస్ అని అర్థం వచ్చేలా టైటిల్ డిజైన్ చేశారు. బహుశా ఈ చిత్రంలో నోయల్ డబ్బు, లేడీస్ అంటే మక్కువ ఎక్కువగా ఉండే పాత్రలో నటిస్తున్నాడేమో.

ఈ చిత్రంలో నోయెల్ కి జంటగా రంగస్థలం బ్యూటీ పూజిత పొన్నాడ నటిస్తోంది. వినోద్ నాగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 18న స్పార్క్ ఓటిటి రిలీజ్ చేయనున్నారు. నోయల్ ఎన్నో తెలుగు చిత్రాలకు పాటలు పాడాడు. అలాగే నటుడిగా కూడా చాలా సినిమాలు చేశాడు.