‘నార‌ప్ప‌’ నుంచి మ‌ణిశ‌ర్మ వాకౌట్ ?

విక్టరీ వెంకటేశ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నారప్ప‌’. సురేష్ ప్రొడక్ష‌న్స్ , వి క్రియేషన్స్ పతాకాలపై కలైపులి థాను, డి.సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. కోవిడ్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ, స్టార్ట్ అయిన ‘నారప్ప‌’ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌నుల‌ను పూర్తి చేసుకోవ‌డంలో బిజి బిజీగా ఉంది. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే 14 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. అయితే రిలీజ్ డేట్‌పై యూనిట్ పున‌రాలోచ‌న‌లో ప‌డింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ షాకిచ్చాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కీ మ‌ణిశ‌ర్మ ఏం చేశాడో తెలుసా?.. ఇది వ‌ర‌కే టీజ‌ర్ విష‌యంలో త‌న బ్యాగ్రౌండ్‌ను వాడుకోకుండా జీవీ ప్ర‌కాశ్ సంగీతం అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ను వాడుకున్నారు. వాడుకుంటే వాడుకున్నారు కానీ.. మ‌ణిశ‌ర్మ పేరు వేయ‌డంతో మ‌ణిశ‌ర్మ‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌పై అసంతృప్తిగా ఉన్న మ‌ణిశ‌ర్మ‌..ఈ డిస్ శాటిస్పాక్ష‌న్‌తోనే నార‌ప్ప టీమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌ల‌పై ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.