మొన్న మహేష్.. నిన్న చరణ్.. నేడు అఖిల్..
Send us your feedback to audioarticles@vaarta.com
1999లో మహేష్‌బాబు 'రాజకుమారుడు'తో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. 2007లో 'చిరుత'తో రామ్ చరణ్ తెరంగేట్రం చేసినా.. 2015లో 'అఖిల్'తో అక్కినేని అఖిల్ హీరోగా డెబ్యూ ఇవ్వనున్నా ఓ ఫ్యాక్టర్ మాత్రం కామన్‌గా ఉంది. అదేమిటంటే.. స్వరబ్రహ్మ మణిశర్మ ఆయా సినిమాలకు పనిచేయడం. 'అఖిల్'కి మినహాయిస్తే.. మిగిలిన రెండు చిత్రాలకూ పాటలను సైతం తనే స్వరపరిచాడు. టాలీవుడ్‌ని ఏలిన కథానాయకుల వారసుల తొలి సినిమాలకి మణిశర్మ రీరికార్డింగ్ ఇచ్చాడంటే.. ఆ సినిమా హిట్టే అనే సెంటిమెంట్ 'రాజకుమారుడు', 'చిరుత'తో ఫ్రూవ్ అయింది. అదే సెంటిమెంట్ 'అఖిల్' కి కూడా కొనసాగుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com