అల్లు శిరీష్ కి కూడా కలిసొస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన సంగీత దర్శకుడు అంటే మొదటగా వినిపించే పేరు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఆ కుటుంబంలో తొలిసారిగా ఏ కథానాయకుడికి మణిశర్మ సంగీతమందించినా.. ఆ సినిమా ఇప్పటివరకు హిట్టే అయ్యింది. మెగాస్టార్ చిరంజీవితో బావగారూ బాగున్నారాతో మొదలైన ఈ ప్రస్థానం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఖుషి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌తో చిరుత, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌తో పరుగు.. ఇలా సక్సెస్‌ఫుల్‌గానే సాగింది.
ఇప్పుడు ఈ వరుసలో మరో కథానాయకుడు చేరుతున్నాడు. అతనే అల్లు శిరీష్. ఎక్కడికి పోతావు చిన్నవాడా దర్శకుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కూడా మణిశర్మనే సంగీత దర్శకుడు. అల్లు శిరీష్, మణిశర్మ కాంబినేషన్లో వస్తున్న ఈ తొలి చిత్రం.. డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిరు, పవన్, చరణ్, బన్ని.. ఇలా మెగా ఫ్యామిలీ హీరోలతో మొదటిసారిగా పనిచేసిన చిత్రాలన్నింటికి కలిసి రావడమే కాకుండా.. మ్యూజికల్‌గా ఆ చిత్రాలను ఓ రేంజ్లో నిలిపిన మణి.. ఆ మ్యాజిక్‌ని శిరీష్ విషయంలోనూ కొనసాగిస్తాడా? వేచిచూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com