నాగ్‌తో మణిరత్నం పోటీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
నాగార్జున, నాని మల్టీస్టారర్ దేవదాస్.. మణిరత్నం తెరకెక్కించిన మల్టీస్టారర్ నవాబ్. ఒకేసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. వివరాల్లోకెళ్తే.. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ‘నవాబ్’ (తమిళంలో ‘చెక్క చివంత వానం’) పేరుతో ఓ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ అయ్యింది. సెప్టెంబర్ 27న సినిమా విడుదల కానుంది.
ఇందులో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితిరావ్ హైదరి, ఐశ్వర్యా రాజేష్, ప్రకాష్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. మరి అదే రోజున నాగ్, నాని మల్టీస్టారర్ విడుదల నవాబ్‌కు గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com