మణిరత్నం సినిమా టైటిల్ మారింది...
Send us your feedback to audioarticles@vaarta.com
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నిర్మాతగా మరో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి మణిరత్నం దర్శకత్వంలో రానున్న సినిమా `కాట్రు వెలియడు`. కార్తీ, ఆదితిరావు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి 24న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఓకే రోజున విడుదల కానుంది. ముందుగా ఈ సినిమాకు `డ్యూయెట్` అనే టైటిల్‌ను అనుకున్నారు కానీ ఇప్పుడు టైటిల్‌ను `చెలియా`అని మార్చారు. మారి తెలుగు టైటిల్‌ను మార్చడానికి గల కారణాలేంటో తెలియలేదు. ఈ చిత్రంలో కార్తీ ఎయిర్‌ఫోర్స్ ఫైలట్‌గా రోల్లో కనపడనున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com