విలన్ పాత్రలో మణిరత్నం హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
నటనకు స్కోప్ ఉండే పాత్రల్లో నటించేందుకే.. నటీనటులు ఎప్పుడూ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అందులోనూ నెగటివ్ రోల్ అంటే.. వారిలోని బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వొచ్చనే ఉద్దేశంతో కొంతమంది స్టార్ హీరోస్ కూడా విలన్ పాత్రలు చేయడానికి వెనుకాడడం లేదు. ఇప్పుడు ఈ నెగటివ్ రోల్స్ చేసిన తారల లిస్ట్‌లో.. నిన్నటితరం హీరోయిన్ కూడా చేరుతున్నారు. ఆమె మరెవరో కాదు.. మధు బాల.
ఆ వివరాల్లోకి వెళితే.. ‘రోజా’, ‘అల్లరి ప్రియుడు’, శంకర్ తొలిచిత్రం ‘జెంటిల్‌మేన్’తో తెలుగు సినీ ప్రేమికులను అలరించిన మధుబాల.. ఇప్పుడు ఓ తమిళ సినిమా కోసం విలన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'అగ్నిదేవ్' అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్న బాబీ సింహా కథానాయకుడిగా నటిస్తుండగా.. జె.పి.ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో మధు బాల పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. డిసెంబర్ నెలలో విడుదల కానున్న ఈ సినిమా.. తెలుగులోనూ అనువాదం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments