తెలుగు ద‌ర్శ‌కుల కోసం మ‌ణిర‌త్నం..!

  • IndiaGlitz, [Monday,June 08 2020]

ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘పొన్నియ‌న్‌సెల్వ‌న్’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా దీన్ని ఆయ‌న రూపొందిస్తున్నారు. మ‌రో ప‌క్క ట్రెండ్‌కు త‌గిన‌ట్లు వెండితెర నుండి డిజిట‌ల్ రంగంలోకి కూడా ఆయ‌న అడుగు పెడుతున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. నవరస అనే పేరుతో ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ కోసం మణిరత్నం ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించ‌డానికి రెడీ అయ్యార‌ట‌. అయితే బిజీ షెడ్యూల్ దృష్ట్యా త‌న‌కొక్క‌డినే కాకుండా తొమ్మిది మంది ద‌ర్శ‌కుల‌తో తొమ్మిది భాగాలుగా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే త‌మిళ చిత్రసీమ‌కి చెందిన కొంత మంది ద‌ర్శ‌కుల‌ను ఆయ‌న ఓకే చేశార‌ట‌. ఇప్పుడు తెలుగు ద‌ర్శ‌కుల‌ను కొంత మందిని తీసుకుంటే బావుంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుంద‌ని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ నిర్మాణ బాధ్య‌త‌ల‌ను మ‌ణిర‌త్న‌మే చూస్తార‌ని అంటున్నారు. అస‌లు తొమ్మిది మంది ద‌ర్శ‌కుల‌తో మ‌ణిర‌త్నం ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేయ‌డ‌మే డిఫ‌రెంట్. మ‌రిది ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

విరాట‌ప‌ర్వంలో ముందు వేరే హీరోను అనుకున్నారట..

నీదినాది ఒకే క‌థ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన వేణు ఊడుగుల ఇప్పుడు విరాట‌ప‌ర్వం చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రానా, సాయిప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, కొర‌టాల శివ, పూరి

సినిమా ప‌రిశ్ర‌మ‌లో రెండు త‌ర‌గ‌తులు ఎప్ప‌టికీ ఉంటాయి. అందులో కొంద‌రు యాక్టివ్ మెంబ‌ర్స్ ఉంటే.. ఎక్కువ శాతం నాన్ యాక్టివ్ మెంబ‌ర్స్ ఉంటారు.

తొందర‌‌పడొద్దంటున్న బ‌న్నీ... ఇన్‌స్టాలో బ‌న్నీ హ‌వా

క‌రోనా ఎఫెక్ట్‌తో కొనసాగుతున్న లాక్‌డౌన్ వ‌ల్ల సినిమాల షూటింగ్స్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఓకే చెప్పింది. విధి విధానాలు ప్ర‌క‌టించాల్సి ఉంది.

తెలంగాణ‌లో షూటింగ్స్‌కు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్‌

కోవిడ్ 19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు.

వెబ్‌ ఆడియన్స్‌ మనసులు గెలిచి పెద్ద విన్నర్‌గా నిలిచిన 'లూజర్‌'

భారతదేశంలోనే అత్యధికంగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు/కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్న డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్‌ 'జీ 5'. ఇందులో 100కు పైగా ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌లు ఉన్నాయి.