'మణికర్ణిక' టీజర్ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా రోజులుగా అందరిలో ఆసక్తి పెంచుతున్న చిత్రం `మణికర్ణిక`.... `ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` ట్యాగ్‌లైన్. కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రథమ స్వాతంత్ర్య సమరంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత కథను సినిమా రూపంలో తెరకెక్కించారు. గాంధీ జయంతి సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ అమితాబ్ వాయిస్ ఓవర్‌తో స్టార్టయ్యింది.
ఆయన వాయిస్ ఓవర్ టీజర్‌కు ప్లస్ అయ్యింది. మణికర్ణిక ఝాన్సీగా కంగనా పాత్రలో ఒదిగిపోయింది. ఝాన్సీ రాణి పాత్రలో కంగనా చేసిన పోరాటాలు, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలు చేయడం.. టీజర్లో హైలైట్‌గా ఉన్నాయి. అలాగే కాస్ట్యూమ్స్, మహిళా సైన్యం చేసే యుద్దం అన్నీ సినిమాలో ఉన్నాయి. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అఖరి షెడ్యూల్.. ప్యాచ్ వర్క్ అంతా కంగనాయే డైరెక్ట్ చేసింది. జనవరి 25న సినిమా విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments