ఇప్పుడు నిర్మాత కూడా డ్రాప్‌...

  • IndiaGlitz, [Monday,September 10 2018]

కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో నటిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. ఈ సినిమా ద‌ర్శ‌కుడు జాగ‌ర్ల‌మూడి క్రిష్‌. సినిమాలో మ‌రికొన్ని స‌న్నివేశాల‌ను డైరెక్ట్ చేయ‌మ‌ని కోరింది కంగనా. అయితే క్రిష్ 'య‌న్‌.టి.ఆర్‌' సినిమాను డైరెక్ట్ చేయాల్సి ఉండ‌టంతో కంగనానే డైరెక్ట్ చేసుకోమ‌ని.. త‌న‌కు టెక్నిక‌ల్‌గా ఎడిటింగ్‌లో స‌పోర్ట్ చేస్తాన‌ని తెలిపారు. అయితే సినిమాకు అస‌లు స‌మ‌స్య‌లు ఇక్క‌డే మొద‌ల‌య్యాయి. కంగనా డైరెక్ష‌న్ స్టార్ట్ చేయ‌గానే సోనూసూద్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నారు.

కాగా ఇప్పుడు నిర్మాత కూడా సినిమా నుండి త‌ప్పుకున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ముందు అనుకున్న బ‌డ్జెట్ 70 కోట్లు.. అయితే ఇది కాస్త ఇప్పుడు 100 కోట్ల‌ను దాటేలా ఉండ‌టంతో నిర్మాణ బాధ్య‌త‌ల నుండి సంజ‌య్‌కుట్టి త‌ప్పుకున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న సినిమా విడుద‌లవుతుందని యూనిట్ ప్ర‌క‌టించింది. మ‌రి రీ షూట్స్ వల్ల సినిమా ఆలస్యం కాకుంటే అనుకున్న స‌మ‌యంలోనే సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేస్తుంది.

More News

'శైల‌జారెడ్డి అల్లుడు' నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావాలి - కింగ్ నాగార్జున‌

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'.

చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో....

సూప‌ర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సోనూసూద్ ద‌క్షిణాది సినిమాల‌తో పాటు బాలీవుడ్‌లో కూడా త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్నారు.

'క‌ల్కి' కోసం భారీ సెట్‌...

'పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ' త‌ర్వాత డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'క‌ల్కి'. రాఖీ సంద‌ర్భంగా ఇటీవ‌ల సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

రెండు ఫార్మేట్స్‌లో '2.0'

ఎప్పుడో ఆగ‌స్ట్‌లో '2.0' టీజ‌ర్ వ‌స్తుంద‌నుకుంటే ఆల‌స్య‌మైందేంటి?  వినాయ‌క చ‌వితికి టీజ‌ర్ వ‌స్తుందో రాదో? అనే సందేహం ఉండేది.

కొడుకు సినిమా గురించి చెప్పిన శ్రీకాంత్‌

శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ తొలి సినిమా నిర్మలా కాన్వెంట్‌.