'మణికర్ణిక'..కొత్త విడుదల తేది

  • IndiaGlitz, [Saturday,February 17 2018]

భిన్నమైన కథలతో చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్. ప్రస్తుతం వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి జీవితం ఆధారంగా మణికర్ణిక' సినిమాని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న ఈ హిందీ చిత్రంలో జిస్షు సేన్ గుప్త, అంకిత లోఖండే, అతుల్ కులకర్ణి, వైభవ తత్వవాది, సోను సూద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో అనువాదం కానున్న‌ ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది.

ఇదిలా వుంటే...ప్రస్తుతం రాజస్థాన్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. ముందుగా ఈ మూవీని ఏప్రిల్ 27న విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేసారు, కాని చిత్రీకరణతో పాటు వి.ఎఫ్.ఎక్స్. పనులు కూడా అప్పటికి పూర్తయ్యే అవకాశం లేకపోవడంతో...ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. కాగా, అదే సమయానికి అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రధారిగా క్రీడానేపథ్యంతో తెరకెక్కుతున్న గోల్డ్' సినిమా కూడా విడుదల కానుంది.

More News

'రంగస్థలం' లో ఆ ఇద్దరు ఎవరై ఉంటారు?

ప్రేయసి ప్రేమను పొందడానికి ఆమెను పొగుడుతూ ప్రియుడు చాలా అందమైన పాటలు పాడుతూ ఉంటాడు.

ప్రియదర్శికి రెండు సినిమాల్లోనూ కౌంటర్

2016లో 'టెర్రర్ ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు ప్రియదర్శి.అయితే ‘పెళ్లిచూపులు’ చిత్రంతో

వేసవి సందడి.. సమంతదే

గత నాలుగేళ్ళుగా వేసవిలో తన సినిమాలతో..సమంత బాగానే సందడి చేస్తోంది.

సుకుమార్.. ముచ్చటగా మూడోసారి

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా పరిచయమై 14 ఏళ్లు అవుతోంది.

నితిన్ జోడీగా రాశి ఖ‌న్నా?

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన 'తొలి ప్రేమ' సినిమా విజ‌యంతో మ‌రోసారి ప‌రిశ్ర‌మ దృష్టిలో ప‌డింది ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ సినిమాలో వ‌ర్ష పాత్ర‌లో యువ‌త‌రాన్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ‌ని..తాజాగా ఓ మంచి అవ‌కాశం వ‌రించింద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.