'మణికర్ణిక' కు కోర్టులో ఊరట
- IndiaGlitz, [Thursday,January 24 2019]
కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయ్‌ని తప్పుగా చూపించారని కర్ణిసేన ఆందోళనలు చేపడుతున్నాయి. అలాగే బాంబే హైకోర్టులో కర్ణిసేనలు సినిమా విడుదలను ఆపమంటూ పిటిషన్ కూడా వేశారు.
దీనిపై స్పందించిన బాంబే హైకోర్టు సినిమా విడుదలను ఆపలేమని తేల్చి చెప్పేసింది. సినిమాపై వస్తున్న ఆరోపణల్లో చిత్ర బృందం రెండు వారల్లో నివేదిక ఇవ్వాలని నివేదిక సమర్పించాలని యూనిట్‌ను కోరింది. జాగర్లమూడి క్రిష్, కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కమల్ జైన్ నిర్మించారు. 50 దేశాల్లో సినిమా జనవరి 25న విడుదల కానుంది.