close
Choose your channels

ఖ‌చ్చితంగా ఆయ‌న‌తో సినిమా చేస్తానంటున్న నాని

Wednesday, February 10, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ హీరో నాని ఖ‌చ్చితంగా సినిమా చేస్తానంటున్నాడు ఎవ‌రితో అనుకుంటున్నారా...? భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన మ‌ణిర‌త్నంతో..ఇటీవ‌ల మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన చిత్రం ఓకె బంగారం. ఈ చిత్రంలో హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ కి నాని డ‌బ్బింగ్ చెప్పాడు కూడా. ఆ స‌మ‌యంలో నానికి మ‌ణిర‌త్నంతో ప‌రిచ‌యం పెరిగింది. ఆత‌ర్వాత మ‌ణిర‌త్నం త‌దుప‌రి చిత్రంలో నాని న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

అయితే ఏమైందో ఏమో కానీ...ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ విష‌యం గురించి నానిని అడిగితే...మ‌ణిర‌త్నం గారితో చేయాల‌నుకున్న సినిమా క‌థ, అప్ప‌ట్లో రిలీజైన బాలీవుడ్ మూవీకి కాస్త ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే మ‌ణిరత్నం గారితో నేను ఖ‌చ్చితంగా సినిమా చేస్తాను. కానీ ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడు చెప్ప‌లేను అంటున్నాడు. అదీ సంగ‌తి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.