'ఊల్లాల  ఊల్లాల' అంటూ ఉర్రూతలూగించనున్న మంగ్లీ

  • IndiaGlitz, [Saturday,October 19 2019]

తెలుగు రాష్ట్రాలను తన గానంతో ఉర్రూతలూగించిన మంగ్లీ తొలిసారిగా ఊల్లాల ఊల్లాల చిత్రం లో నటించింది. అలాగే ఈ చిత్రంలో ఒక పాట కూడా పాడింది. దాంతోపాటు హీరోయిన్ నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది. నటరాజ్ , నూరిన్ , అంకిత హీరో, హీరోయిన్లు గా రూపొందుతున్న చిత్రం ఊల్లాల ఊల్లాల . సీనియర్ నటుడు 'సత్య ప్రకాష్ ఈ చిత్రం ద్వారా దర్శకుని గాపరిచయమవుతున్నారు.. సుఖీభవ మూవీస్ పతాకంపై ఏ . గురురాజ్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రంనవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత ఏ.గురురాజ్ మాట్లాడుతూ.. మంగ్లీ కి తెలుగు నాట మంచిపాపులారిటీ ఉంది. ఆమె మా సినిమాలో పాట పాడింది, యాక్ట్ చేసింది, హీరోయిన్నూరిన్ కి డబ్బింగ్ చెప్పింది. ఈ రకంగా మంగ్లీ మా సినిమా లో స్పెషల్ ఎట్రాక్షన్ గానిలువనుంది. అలాగే బిగ్ బాస్- 2 తో క్రేజ్ తెచ్చుకున్న రోల్ రైడా ఇందులో ఓ పాటపాడడంతో పాటు, ఆ పాటలో నటించారు కూడా. ఇంకా ఈ చిత్రం లో ఇలాంటి విశేషాలుచాలా ఉన్నాయి . భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాము . ఇందులో ఎన్నో వింతకా రెక్టర్లు కూడా ఉన్నాయి. మా బేన‌ర్‌లో 'ర‌క్ష‌క‌భ‌టుడు', 'ఆనందం మ‌ళ్లీ మొద‌లైంది', 'ల‌వ‌ర్స్ డే' చిత్రాల త‌ర్వాత వ‌స్తున్న సినిమా 'ఉల్లాలా ఉల్లాలా'. ఇలాంటి కాన్సెప్ట్ లుచాలా అరుదుగా వ‌స్తుంటాయి. స‌త్య‌ప్ర‌కాశ్‌కి న‌టునిగా ఎంత పేరుందో, ద‌ర్శ‌కునిగాఅంత‌క‌న్నా ఎక్కువ పేరు ఈ చిత్రం ద్వారా వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాను'' అని చెప్పారు.

దర్శకుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ- ''ఇదొక రొమాంటిక్ ఎంటెర్టైనింగ్ థ్రిల్లర్. మాఅబ్బాయి నటరాజ్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అవుతున్నదుకుచాలా గర్వంగా ఉంది . ఈ సినిమాలో చాలా గొప్ప కంటెంట్ ఉంది . చాలా ఎట్రాక్షన్స్కూడా ఉన్నాయి . ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ కూడా వున్నాయి'' అని చెప్పారు.

తారాగ‌ణం: న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత‌, గురురాజ్‌, స‌త్య‌ప్ర‌కాష్‌, 'బాహుబ‌లి' ప్ర‌భాక‌ర్‌, పృథ్వీరాజ్‌, 'అదుర్స్' ర‌ఘు, జ‌బ‌ర్ధ‌స్త్ న‌వీన్‌, లోబో, మ‌ధు, జ‌బ‌ర్ధ‌స్త్ అప్పారావు, రాజ‌మౌళి, జ్యోతి, గీతాసింగ్‌, జ‌య‌వాణి త‌దిత‌రులు

More News

'ప్రేమ పిపాసి' టీజ‌ర్ లాంచ్‌

ఎస్‌.ఎస్‌.ఆర్ట్ ప్రొడక్ష‌న్స్ ప‌తాకం పై రాహుల్ భాయ్ మీడియా మ‌రియు దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `ప్రేమ‌ పిపాసి`

దూసుకెళ్తున్న 'అల వైకుంఠపురంలో’ పాట

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని

ఫ్యాన్సీ రేటుకు నాని `వి`సినిమా శాటిలైట్ హ‌క్కులు

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న చిత్రం `వి`. దిల్‌రాజు నిర్మాణంలో ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌కుడిగా ఈ సినిమాను తెర‌కెక్కుతుంది.

రామ్ జోడిగా ఓ ప్లాప్ హీరోయిన్‌..మ‌రో హిట్ భామ‌

తొలి చిత్రం `నేల‌టిక్కెట్టు`తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ముద్దుగుమ్మ మాళ‌వికా శ‌ర్మ‌.

దిల్‌రాజు, క్రిష్ నిర్మాణంలో అవ‌స‌రాల శ్రీనివాస్ హీరోగా `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` కొత్త చిత్రం

మంచి తెలుగు సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌ను అందించాల‌ని కోరుకునే నిర్మాత‌ల్లో నిర్మాత దిల్‌రాజు ముందు వ‌రుస‌లో ఉంటారు.