సాహోలో మందిరా..
Send us your feedback to audioarticles@vaarta.com
మందిరా బేడి..ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు క్రికెట్‌కు గ్లామర్ అద్దిన ఈమె తర్వాత సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. హిందీ సినిమాల్లో నటించిన మందిరా 2004లో విడుదలైన మన్మథ చిత్రంలో ఓ పాత్రలో కనిపించింది. ఓ పాటలో కూడా శింబుతో ఆడిపాడింది. ఈ సినిమా తెలుగులో కూడా అనువాదమై మంచి విజయాన్ని సాధించింది. తర్వాత మందిరా బేడి మరే దక్షిణాది చిత్రంలో నటించలేదు.
దాదాపు పదమూడేళ్ల తర్వాత ఇప్పుడు మందిరా రెండు దక్షిణాది సినిమాల్లో నటిస్తుంది. అందులో ఒకటి తమిళ చిత్రం కాగా మరో సినిమా మాత్రం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో చిత్రం. బాహుబలి తర్వాత ఇప్పుడు అందరూ ప్రభాస్ ఏ సినిమా చేస్తాడోనని ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతన్నసాహోపై అంచనాలు డబుల్ అయ్యాయి. అందరి అంచనాలను అందుకునే టాప్ యాక్టర్స్, టెక్నిషియన్స్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగా ఈ సినిమాలో ఓ నెగటివ్ రోల్ కోసం మందిరా బేడిని సంప్రదిస్తున్నారట. మందిరా కూడా పాత్ర చేయడానికి ఆసక్తిగా ఉందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com