మంచు విష్ణు భార్యకు గాయాలు...

  • IndiaGlitz, [Saturday,June 18 2016]

మంచు మోహ‌న్ బాబు పెద్ద త‌న‌యుడు మంచు విష్ణు స‌తీమ‌ణి విరోనికా రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు. ప‌హాడీ ష‌రీష్ ప‌రిధిలో జ‌ల్ ప‌ల్లి వద్ద ఉన్న ఫాంహౌస్‌కు వెళుతున్న విరోనికా ప్ర‌యాణిస్తున్న కారును గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిందంటున్నారు.

అయితే గాయాలేం పెద్ద‌గా లేద‌ని అంటున్నారు. విరోనికాను చికిత్స నిమిత్తం అపోలో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఈ ఘటనపై విష్ణు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందిచాడు. వోల్వో కార్ గ్లోబెల్ కంపెనీకి థాంక్స్ చెప్పుకున్నాడు. ఈ కంపెనీ కారు వల్ల మేజర్ యాక్సిడెంట్ అయినప్పటికీ చిన్న గాయాలతో తన భార్య బ్రతికిందని విష్ణు తెలియజేశారు.