ఆ డైరెక్టర్ తో మళ్లీ సినిమా చేస్తున్న విష్ణు..
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు విష్ణు నటించిన తాజా చిత్రం డైనమేట్ ఇటీవల రిలీజైంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత విష్ణు అడ్డా డైరెక్టర్ సాయి రెడ్డితో ఓ మూవీ ప్రారంభించాడు. ఇంతలో మరో సినిమా కూడా ఫైనల్ చేసాడు.గతంలో తనకి మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్ తోనే మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..జి.నాగేశ్వరరెడ్డి. విష్ణు హీరోగా నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో దేనికైనా రెడీ చిత్రం రూపొందించింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
మళ్లీ ఇప్పుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విష్ణు. ఈ చిత్రాన్ని ఎ.కె ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర్ నిర్మిస్తున్నారు. బిందాస్ చిత్రం నుంచి విష్ణుతో సినిమా చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదరింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు నిర్మాత అనిల్ సుంకర.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com