యాక్సిడెంట్ అనంతరం మళ్ళీ షూటింగ్ మొదలెట్టిన మంచు విష్ణు
Send us your feedback to audioarticles@vaarta.com
"ఆచారి అమెరికా యాత్ర" షూటింగ్ లో భాగంగా తెరకెక్కిస్తున్న ఓ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తుండగా.. బైక్ స్కిడ్ అవ్వడంతో జరిగిన యాక్సిడెంట్ లో చిత్ర కథానాయకుడు మంచు విష్ణు, కథానాయకి ప్రగ్యా జైస్వాల్ గాయాలపాలైన విషయం తెలిసిందే. ప్రగ్యా చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకోగా.. మంచు విష్ణుకు మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ కారణంగా మలేసియాలో మొదలైన సెకండ్ షెడ్యూల్ అర్ధాంతరంగా ఆగిపోయింది.
ఆ యాక్సిడెంట్ కారణంగా అయిన గాయాల నుండి ధృడ నిశ్చయంతో చాలా త్వరగా రీకవరీ అయిన మంచు విష్ణు మళ్ళీ షూటింగ్ మొదలెట్టాడు. జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కీర్తి చౌదరి-కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "చాలా సీరియస్ యాక్సిడెంట్ లో తగిలిన గాయాలను సైతం లెక్క చేయకుండా మంచు విష్ణు చాలా త్వరగా రీకవర్ అయ్యారు. అందుకే త్వరగా షూటింగ్ రీస్టార్ట్ చేయగలిగాం. త్వరలోనే ఫారిన్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నాం" అన్నారు.
విష్ణు మంచు, ప్రగ్యా జైస్వాల్, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, కోట శ్రీనివాసరావు, ఎల్.బి.శ్రీరామ్, విద్యుల్లేఖ రామన్, ప్రభాస్ శ్రీను, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణమురళి, పృథ్వి, ప్రవీణ్, అనూప్ ఠాకూర్ సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, కళ: కిరణ్, ఫైట్స్: సెల్వ, మాటలు: డార్లింగ్ స్వామి, సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: సిద్దార్థ, నిర్మాతలు: కీర్తి చౌదరి-కిట్టు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వర్రెడ్డి!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com