ఆ స్టంట్ విషయంలో నాపై నాకే కోపం వస్తుంటుంది: మంచు విష్ణు
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమాల్లో చూపించే స్టంట్లు చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని కొన్ని సార్లు ఎంత నిపుణుల పర్యవేక్షణలో చేసినప్పటికీ ప్రాణాంతకంగా మారుతూనే ఉంటాయి. అయితే ఒక్కోసారి ఆ స్టంట్లే సినిమాను నిలబెడతాయి కాబట్టి దర్శకుడు వీటిపై దృష్టి సారిస్తుంటారు. అయితే ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలో మంచు విష్ణు, ప్రగ్యా జైశ్వాల్ కలిసి నటించారు. ఈ చిత్రంలో మంచు విష్ణు చేసిన ఓ స్టంట్ కారణంగా తీవ్ర గాయాలపాలైన సన్నివేశాన్ని మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ సమయంలో అసలు ఏం జరిగిందో విష్ణు ఓ పోస్ట్ ద్వారా పంచుకున్నాడు.
‘‘నాకు అది చాలా స్పష్టంగా గుర్తుంది. స్టంట్ కొరియోగ్రాఫర్, దర్శకుడిని నేను ఏదైనా జరుగుతుందని వారించాను. వారు వినిపించుకోలేదు. నాకు అంగీకరించక తప్పలేదు. ప్రగ్యా జైశ్వాల్ ప్రాణాల్ని కూడా రిస్క్‌లో పెట్టినందుకు నాపై నాకే ఇప్పటికీ కోపం వస్తుంటుంది. అయితే అదృష్టవశాత్తు ఆమె బాగానే ఉంది. నా జిమ్నాస్టిక్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కారణంగానే నేను తలకు ఎలాంటి దెబ్బ తగిలించుకోకుండా బయటపడ్డాను. ‘టంబుల్’ ట్రైనింగ్ అంటే నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ అదే ఆ రోజు మమ్మల్ని రక్షించింది. నా భార్య విరోనిక అప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉంది. నా విషయం ఆమెను చాలా భయపెట్టింది. ఇప్పటికీ నేను ఆ విషయంలో ఆమెకు క్షమాపణ చెబుతూనే ఉంటా. ఈ ఘటన నాకొక గుణపాఠంగా మారింది’’ అని మంచు విష్ణు పేర్కొన్నాడు.
అయితే మంచు విష్ణు ఈ పోస్ట్‌తో పాటు ఓ వీడియోను కూడా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. ఆ వీడియోలో విష్ణు, ప్రగ్యా జైశ్వాల్‌ను తన బైక్‌పై ఎక్కించుకుని వెళుతుండగా.. విలన్స్ చేజ్ చేస్తూ ఉంటారు. వారి నుంచి తప్పించుకుని వెళ్లాలి. మంచు విష్ణు బైక్‌పై నుంచి పడిపోతాడు. ఆయన బైక్‌పై వెనుక ఉన్న ప్రగ్యా కూడా పడిపోతుంది కానీ ఆమె తలకు హెల్మెట్ ఉండటంతో సేవ్ అయిపోయింది. విష్ణు తలకైతే గాయాలేమీ కాలేదు కానీ చేతికి మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ స్టంట్ వద్దని తాను.. డైరెక్టర్, స్టంట్ కొరియోగ్రాఫర్‌ని ఎంతగానో వారించానని.. అయినా వారు వినకపోవడంతో చేయక తప్పలేదని చెప్పాడు. ఈ స్టంట్ చేసినందుకు ఇప్పటికీ తనపై తనకే కోపం వస్తుంటుందని మంచు విష్ణు పోస్టులో పేర్కొన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com