విష్ణు - రాజ్ త‌రుణ్ మూవీ టైటిల్...

  • IndiaGlitz, [Monday,March 14 2016]

మంచు విష్ణు - రాజ్ త‌రుణ్ వీరిద్ద‌రు క‌ల‌సి ఓ సినిమా చేస్తున్నవిష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు స‌ర‌స‌న సోనారిక న‌టిస్తుండ‌గా రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న హేబ్బా ప‌టేల్ న‌టిస్తుంది. పంజాబీ మూవీకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి వెరైటీగా వీడు అదో టైపు - వాడు మ‌రో టైపు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం.

టైటిల్ కాస్త పెద్ద‌దిగా ఉన్నా...క్యాచీగా ఉండ‌డంతో ఈ టైటిల్నే ఫిక్స్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. డైన‌మేట్ పై విష్ణు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నఫ‌లించ‌లేదు. అలాగే రాజ్ త‌రుణ్ కూడా సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు తో ఫ్లాప్ చూడ‌వ‌ల‌సి వ‌చ్చింది. దీంతో విష్ణు - రాజ్ త‌రుణ్ ఇద్ద‌రికీ స‌క్సెస్ అవ‌స‌రం. ఈ సినిమా పై ఇద్ద‌రు మంచి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఈ స‌మ్మ‌ర్ లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..విష్ణు - రాజ్ త‌రుణ్ ల‌కు ఈ సినిమా స‌క్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.