పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం.. నాన్నగారి గురించి సునీల్ ని అడగండి: మంచు విష్ణు

  • IndiaGlitz, [Tuesday,July 13 2021]

త్వరలో జరగబోయే మా అసోసియేషన్ ఎన్నికల వ్యవహారం రోజు రోజుకూ హీటెక్కుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సివిల్ నరసింహారావు లాంటి ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పోటీలో విజయం సాధించేందుకు ఎవరికి వారు గ్రౌండ్ వర్క్ ప్రారంభించేశారు. తాజాగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మా అసోసియేషన్ బిల్డింగ్ కి అయ్యే ఖర్చు మొత్తం తనదే అంటూ విష్ణు సంచలన ప్రకటన చేశారు.

'చెన్నైలో ఫిలిం ఇండస్ట్రీ ఉన్నప్పుడు సౌత్ కి మొత్తం ఒక్క నడిగర్ సంఘం మాత్రమే ఉండేది. అయితే తెలుగువారికి మాత్రమే ప్రత్యేకంగా అసోసియేషన్ ఉంటే బావుంటుందని అప్పట్లో సినీ పెద్దలు తెలుగు సినీ అసోసియేషన్ ని ప్రారంభించారు. ఆ తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చింది.

1993లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని ఏఎన్నార్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, చిరంజీవి, నాన్నగారు, మురళి మోహన్ లాంటి పెద్దలు స్థాపించారు. మా అసోసియేషన్ లో నాన్నగారికి పదవి ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడూ తన సినిమా కుటుంబం కోసం అండగా నిలిచారు.

1997లో సినీ కార్మికుల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఓ బడా పొలిటీషియన్ కంపెనీ వల్ల ఆ ల్యాడ్ చిక్కుల్లో పడింది. అప్పుడు స్వయంగా నాన్నగారు అప్పటి గవర్నర్ రంగరాజన్ ని కలసి సమస్యని పరిష్కరించారు. అదే ఇప్పుడున్న చిత్రపురి కాలనీ.

నటుడు సునీల్ కి కూడా గతంలో ఓ సమస్య వచ్చింది. ఎవరి వద్దకు వెళితే పరిష్కారం అవుతుంది అని సునీల్ మరో నటుడిని అడిగారట. దీనితో ఆ నటుడుమోహన్ బాబు వద్దకు వెళ్లు అని సలహా ఇచ్చారట. అయితే నాకు మోహన్ బాబుగారితో పరిచయం లేదు అని సునీల్ అన్నాడట. ఎం పర్వాలేదు ఆయన నీ సమస్యని పరిష్కరిస్తారు అని ఆ నటుడు సునీల్ తో చెప్పారు. అప్పుడు సునీల్ నాన్నగారి వద్దకు వచ్చి తన ఇష్యూ సాల్వ్ చేసుకున్నారు. నాన్నగారి గురించి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

అప్పుడే కాదు ఇప్పుడు కూడా నేను, నా కుటుంబం సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారికోసం అండగా నిలబడతాం. వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్స్ కి వెళ్లాం, కోర్టులకు వెళ్లాం.. కొంతమంది రాజకీయ నాయకుల ఇళ్లకు కూడా వెళ్లి సమస్యని పరిష్కరించిన సందర్భాలు ఉన్నాయి.

మేము చేసిన సహాయాలు, దానాలు చెప్పుకోము. ఇప్పటి వరకు మా అసోసియేషన్ అధ్యక్షులుగా పని చేసిన వారంతా వారి వారి స్థాయిలో మంచి కార్యక్రమాలు చేశారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ అవి ఉద్దేశ పూర్వకంగా సృష్టించిన సమస్యలు కావు. గతంలోనే మా అసోసియేషన్ బిల్డింగ్ కు అయ్యే ఖర్చు 20 శాతం వరకు ఇస్తానని అప్పట్లోనే ఏఎన్నార్ గారి ముందు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నా.. మా అసోసియేషన్ బిల్డింగ్ కి అయ్యే ఖర్చు మొత్తం నా కుటుంబానిదే. ప్రతి రూపాయి మేమే ఇస్తాం.

దాసరి నారాయణరావు గారు, మురళి మోహన్ లాంటి పెద్దలు 2015లోనే నన్ను మా అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేయమని అడిగారు. కానీ నాన్నగారు కలగజేసుకుని ఇప్పుడు విష్ణు అనుభవం సరిపోదు అని వాళ్లకు నచ్చజెప్పారు. కానీ ఇప్పుడు నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నా. ఇండస్ట్రీలోని పెద్దలు నాన్నగారు, చిరంజీవి గారు, మురళి మోహన్ గారు, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు లాంటి వాళ్లంతా ఇతడే మా అధ్యక్షుడు అని ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నేను పోటీ నుంచి తప్పుకుంటా. లేకుంటే నేను పోటీ చేస్తా. ఆశీర్వదించండి' అని విష్ణు పేర్కొన్నాడు.

More News

జూలై 16న ఆహాలో 'కుడి ఎడమైతే'.. ఉత్కంఠగా టీజర్!

చిన్న, మీడియం బడ్జెట్ లలో థ్రిల్లర్ చిత్రాలకు ఓటిటిలు వేదికలుగా మారుతున్నాయి. ప్రేక్షకులు కోరుకునే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఓటిటి వేదికలలోకి సినిమాలు తీసుకువస్తున్నారు.

పోలీస్ గా, డాక్టర్ గా హీరో రామ్.. లింగుస్వామి మూవీ స్టోరీ లీక్?

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ మాస్ ఎంటర్టైనర్ కు రెడీ అవుతున్నాడు. లింగుస్వామి దర్శత్వంలో తెరకెక్కే చిత్ర షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ మాస్ హిట్ అందుకున్న

అఫీషియల్: 'నారప్ప' డైరెక్ట్ ఓటిటి రిలీజ్..

విక్టరీ వెంకటేష్, అందాల తార ప్రియమణి జంటగా నటించిన 'నారప్ప' చిత్రం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత సురేష్ బాబు ఓటిటి రిలీజ్ వైపు వెళతారా లేక థియేటర్స్ లోనే

పూజా హెగ్డే థైస్ అందాలు వైరల్.. సూపర్ సెక్సీగా బుట్టబొమ్మ

పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.

గూస్ బంప్స్ తెప్పిస్తున్న అజయ్ దేవ్ గణ్ 'భుజ్' ట్రైలర్!

బాలీవుడ్ లో సాహసాలకు మారుపేరు అజయ్ దేవ్ గణ్. తన పాత్ర కోసం అజయ్ ఎంతటి సాహసానికైనా వెనుకాడరు. అందుకే అజయ్ దేవగణ్ చిత్రాలలో యాక్షన్ సన్నివేశాలు మతిపోగొట్టే విధంగా ఉంటాయి.