Manchu Vishnu: మంచు విష్ణు లేటెస్ట్ మూవీకి వివాదాస్పద టైటిల్.. పాకిస్తాన్‌తో లింక్
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు వారి పెద్దబ్బాయి మంచు విష్ణు సినిమాల విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. చివరిగా 2021లో మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మళ్లీ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. వ్యాపారాలు, కరోనా వైరస్, లాక్‌డౌన్, తర్వాత ‘మా’ ఎన్నికల కారణంగా విష్ణుకి కుదరలేదు. ప్రస్తుతం పరిస్ధితులు చక్కబడటంతో మంచు విష్ణు సినిమాలపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఢీ అంటే ఢీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు విష్ణు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. దీనితో పాటుగా సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. అలాగే పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేశారు మంచు విష్ణు అండ్ టీమ్. ఈ ఈవెంట్‌ను వెరైటీగా ప్లాన్ చేశాడు విష్ణు.. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇందులో ముందుగా సునీల్‌కు ఫోన్ చేసి..తాను ఓ సినిమా చేయాలనుకుంటున్నా అని విష్ణు అడుగుతాడు. దీనికి సునీల్ బదులిస్తూ.. మా అధ్యక్షుడిగా ఉన్నావ్ కథ, సినిమాలు మానేశావ్ అని విన్నాను అని చెబుతాడు. ఇదంతా పుకారు.. సోషల్ మీడియాలో ఏవేవో రాస్తుంటారని విష్ణు అన్నాడు. దానికి సునీల్ కథ కోసం కోన వెంకట్‌ను రికమెండ్ చేయడం.. కోన వచ్చి చోటా కే నాయుడిని, దర్శకుడు సూర్యను, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్‌ను సిఫారసు చేస్తాడు. అంతే ఓకే అన్నాక... చివరిగా ఈ సినిమాకు టైటిల్ ఏం పెడదాం.? అని విష్ణు కోన వెంకట్‌ను అడగ్గా ‘జిన్నా’అని చెప్తాడు.
దీంతో విష్ణు షాకవుతాడు.. జిన్నా ఏంటండీ.. పాకిస్తాన్, మహమ్మద్ అలీ జిన్నా గుర్తుకు వస్తున్నాయి. కాంట్రవర్సీ అవుతుందేమో అంటాడు. దీనికి కోన వెంకట్ బదులిస్తూ.. మనకథలో హీరో పేరు ‘‘ గాలి నాగేశ్వర రావు’’ అని అతడి పేరు అతనికే నచ్చదని చెబుతాడు. అందుకే జి.నాగేశ్వర రావుని 'జిన్నా'గా మార్చానని అనడంతో విష్ణు టైటిల్ అదిరిపోయిందని అంటాడు. వెంటనే టైటిల్ లోగో పడుతుంది. అయితే తిరుపతి కొండల నుండి ఈ టైటిల్ రావడం వల్ల ఇందులో రాయలసీమ కుర్రాడిగా మంచు విష్ణు నటిస్తున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments