మంచు విష్ణు నూతన చిత్రం విశేషాలు...

  • IndiaGlitz, [Saturday,September 05 2015]

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ మంచు విష్ణు హీరోగా, జాదూగాడు' ఫేమ్ సోనారిక హీరోయిన్ గా ఓ నూతన చిత్రం రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వరస్వామి ఫిలింస్ బ్యానర్ పై జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో డి.కుమార్, పల్లి కేశవ్ రావ్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా ప్రారంభం కానుంది. మరో ప్రముఖ హీరోయిన్ కూడాఈ సినిమా నటించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 10, ఉదయం 9గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు.

బ్రహ్మానందం, రాజారవీంద్ర, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి, వెన్నెలకిషోర్, రఘుబాబు తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: రామాంజనేయులు, ఫైట్స్: విజయ్, కో డైరెక్టర్: రాధా గోపాలరాజు(గోపి), నిర్మాణ, నిర్వహణ: సోమ విజయ ప్రకాష్, నిర్మాతలు: డి.కుమార్, పల్లి కేశవ్ రావ్, రచన-దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి.

More News

ఎన్.టి.ఆర్ తో ప్లాన్ చేస్తున్నారట...

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి ‘కుమారి 21 ఎఫ్’ పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇల్లీ బేబి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు...

జగన సుందరిగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలుగులో సినిమాలు చేయడం లేదు.

కంచె గురించి మహేష్ స్పందించడానికి కారణం అదేనా...?

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం కంచె. ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నారు.

'బ్రూస్ లీ' కామెడి ?

మార్షల్ ఆర్ట్స్ లో నెంబర్ వన్ అయిన బ్రూస్ లీ కామెడి చేయడమేంటని అనుకుంటున్నారా. ఆయన గురించి కాదులేండి.

ఈసారైనా మాట నిలబెట్టుకుంటాడా...నితిన్...?

నితిన్ తో సినిమా చేయాలని మల్లిడి వేణు అనే యువదర్శకుడు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు.మల్లిడి వేణు చెప్పిన కథ నచ్చి నితిన్ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు