సూపర్ స్టార్ ని కలిసిన మంచు విష్ణు.. 'మా' ఎన్నికల్లో పోటీ!
Send us your feedback to audioarticles@vaarta.com
ఈసారి 'మా' అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాను 'మా' ఎన్నికల్లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా సమాచారం మేరకు హీరో మంచు విష్ణు కూడా 'మా' ఎన్నికలలో అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన రకుల్ .. హరీష్ శంకర్ సపోర్ట్
మంచు విష్ణు సైలెంట్ గానే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేశారు. నేడు మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలసి సూపర్ స్టార్ కృష్ణని కలిశారు. 'మా' ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విష్ణు కృష్ణని కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నటుడు నరేష్ ఈసారి పోటీ చేయడం లేదు.
దీనితో నరేష్ ప్రకాష్ రాజ్, విష్ణులలో ఎవరో ఒకరికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కృష్ణ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా విష్ణు ఈ ఎన్నికని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో తాను పోటీ చేయబోతున్నట్లు అధికరించగా ప్రకటించనున్నారు.
తాజాగా కృష్ణని కలిసిన విష్ణు త్వరలో ఇండస్ట్రీలోని సీనియర్స్ అందరిని కలవనున్నట్లు టాక్. తన విజయం కోసం విష్ణు అందరి మద్దతు కూడబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ.. చిరంజీవితో సన్నిహితంగా ఉంటోంది. పలు వేదికలపై మోహన్ బాబు, చిరంజీవి మధ్య ఆప్యాయత చూశాం.
త్వరలో విష్ణు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలవబోతున్నాడట. ఇదిలా ఉండగా మరోవైపున ప్రకాష్ రాజ్ కూడా తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మా ఎన్నికలో పోటీ చేయబోతున్న సందర్భంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. త్వరలో మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments