మెగాస్టార్‌ను కలిసి మంచు హీరో.. కారణం మళ్లీ చెబుతాడట... !
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవికి, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకి ఒకానొక సందర్భంలో మనస్పర్ధలు బాగానే ఉండేవి. అయితే క్రమంగా ఇద్దరూ దగ్గరయ్యారు. రెండు కుటుంబాలు కలిసిపోయాయి. రీసెంట్గా మంచు విష్ణు, చిరంజీవిని కలిశారు. ఆ ఫొటోను తన ట్విట్టర్లోనూ షేర్ చేశారు. ఈరోజు బిగ్‌బాస్‌ను కలిశాను. చాలా విషయాలను నేర్చుకున్నాను అంటూ మంచు విష్ణు ట్వీట్ కూడా పెట్టారు. అయితే తాను మెగాస్టార్ చిరంజీవిని ఎందుకు కలిశానని మాత్రం చెప్పలేదు. తర్వాత చెబుతాను అంటూ సింపుల్‌గా చెప్పేశాడు. దీంతో ఫిల్మ్ నగర్లో పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మంచు విష్ణు ప్యాన్ ఇండియా మూవీగా మోసగాళ్లు సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సపోర్ట్ అందించే వ్యవహారంలో చిరంజీవిని ప్రత్యేకంగా కలిసి మంచు విష్ణు రిక్వెస్ట్ చేశాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తుందని అంటున్నాయి సినీ వర్గాలు.
మోసగాళ్లు సినిమాను జెఫ్రీ చీ గిన్ డైరెక్ట్ చేశాడు. మంచు విష్ణు హీరోగా నటిస్తూ సినిమాను నిర్మిస్తున్నాడు. సునీల్ శెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించగా రుహానీ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com