తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మంచు విష్ణు చిత్రం
- IndiaGlitz, [Tuesday,October 06 2015]
మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో, సోమా విజయ్ ప్రకాష్ నిర్మాణ నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. జాదూగాడు ఫేమ్ సోనారిక హీరోయిన్ గా నటిస్తుంది.డి.కుమార్, పల్లి కేశవరావ్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా...
దర్శకుడు జి.కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ ''మంచు విష్ణు లాంటి హీరో, డి.కుమార్, పల్లి కేశవ్ రావ్ వంటి మంచి నిర్మాతలు ఈ చిత్రంలో ఉండటం చాలా హ్యపీగా ఉంది. లవ్ లోకొత్త యాంగిల్ చూపే లవ్ విత్ యాక్షన్ ఎంటర్ టైనర్. సినిమాని నాలుగు షెడ్యూల్స్ లో హైదరాబాద్, వైజాగ్ లలో చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగా హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండవ షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లోనే ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్‌ను హీరో, హీరోయిన్స్‌పై చిత్రీకరించాం. రెండవ షెడ్యూల్లో కామెడి సన్నివేశాలు, కొంత యాక్షన్ పార్ట్‌ను చిత్రీకరిస్తున్నాం. మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరి. విష్ణుగారి బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. అనూప్ మ్యూజిక్, విజయ్‌కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అవుతుంది'' అన్నారు.
చిత్ర నిర్మాతలు డి.కుమార్. పల్లికేశవరావ్ మాట్లాడుతూ ''మా బ్యానర్ లో చేస్తున్న రెండో మూవీ. సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని రూపొందిస్తాం. విష్ణుగారికి బాడీ లాంగ్వేజ్ కి తగిన స్టోరి. సోనారిక బబ్లీ గర్ల్ గా నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే రెండు షెడ్యూల్స్ ప్లాన్ చేశాం. అందులో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందులో ఓ ప్రముఖ హీరోయిన్ నటిస్తుంది. ఆమె వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. సినిమా చాలా బాగా వస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను దసరా రోజున అనౌన్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. మంచి లవ్ ఫీల్ విత్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది'' అన్నారు.
బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్, పృథ్వీ, రాజా రవీంద్ర, వెన్నెలకిషోర్, శ్రీనివాస్‌రెడ్డి, సత్య, నవభారత్ బాలాజీ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: విజయ్ సి.కుమార్, ఎడిటర్: యస్.ఆర్.శేఖర్, ఆర్ట్: రామాంజనేయులు, ఫైట్స్: విజయ్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్,నిర్మాణ, నిర్వహణ: సోమా విజయ్‌ప్రకాష్, నిర్మాతలు: డి.కుమార్, పల్లి కేశవరావు, రచన-దర్శకత్వం: జి.కార్తిక్ రెడ్డి.