Kannappa: మంచు విష్ణు 'కన్నప్ప' రెండో షెడ్యూల్ ప్రారంభం.. కీలక సన్నివేశాలు షూటింగ్..

  • IndiaGlitz, [Wednesday,February 28 2024]

మంచు విష్ణు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్టు అయిన 'కన్నప్ప ' (Kannappa) మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే న్యూజిలాండ్‌‌లో లాంగ్ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చింది. తాజాగా అక్కడ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించినట్టుగా మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు విష్ణు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్ బాబు(Mohan Babu), ఇతర సిబ్బంది కనిపిస్తున్నారు. ఈ వీడియోలో విష్ణు గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ రెండో షెడ్యూల్‌లో ఒళ్లు గగుర్పొడిచే సీన్లను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో షూట్ చేస్తున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోస్తున్నట్లు చెబుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి అత్యంత ప్రతిభావంతులైన ఆర్టిస్టులు, టెక్నిషియన్లు ఈ మూవీ కోసం కష్టపడుతున్నారు.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ‘మహాభారతం’ (Maha Bharatham) సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా ఫైట్స్ చేస్తుండగా.. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్ర కథకి కీలక మెరుగులు దిద్దగా.. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, కిచ్చా సుదీప్, మోహన్ బాబు లాంటి భారీ తారాగణం నటిస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే మంచు కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు ఇందులో నటిస్తున్నారు. విష్ణు ఐదేళ్ల కుమారుడు మంచు అవ్రామ్ ఈ మూవీ ద్వారా వెండితెర అరంగేట్రం చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

More News

PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.. ఎప్పుడంటే..?

పార్లమెంట్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టా్త్మకంగా తీసుకుంది. ఈసారి ఎలాగైనా 370 ఎంపీ సీట్లు గెలవాలని కృతనిశ్చయంతో ఉంది. అందుకు తగ్గట్లే కార్యాచరణను ప్రారంభించింది.

Gollapalli Suryarao: టీడీపీలో దళితులకు గౌరవం లేదు.. వైసీపీలో చేరిన మాజీ మంత్రి..

ఎన్నికల సమయం కావడంతో పార్టీ మారే సంఖ్య ఎక్కువైపోతుంది. ఈ పార్టీలో టికెట్ రాని వారు ఆ పార్టీలోకి.. ఆ పార్టీలో టికెట్ రాని వారు ఈ పార్టీలోకి మారిపోతున్నారు. టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా

MP Pothuganti Ramulu: బీఆర్ఎస్‌ పార్టీకి ఊహించని షాక్.. బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు

బీఆర్‌ఎస్ పార్టీ మరో భారీ షాక్ తగిలింది. నాగర్‌కర్నూల్‌ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు(MP Ramulu) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు.

Hanuma Vihari: హనుమ విహారి వ్యవహారశైలి తొలి నుంచి వివాదస్పదమే.. ఏసీఏ ప్రకటన..

టీమిండియా క్రికెటర్ హనుమ విహారి విషయంలో పచ్చ నేతలు, పచ్చ మీడియా విష ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తమకు అనుకూలంగా వార్తలను వండి వార్చుతూ ప్రజలను మభ్య పెడుతున్నారు.

Revanth Reddy: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్‌.. బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..?

మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్‌పై బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. గతంలో కూడా 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో..