జర్నలిస్ట్ కుటుంబానికి 22 లక్షలు సాయం చేసిన మంచు విష్ణు

  • IndiaGlitz, [Wednesday,July 06 2016]

రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ గ్రేట్‌ హీరో అనిపించుకున్నాడు మంచు విష్ణు. ప‌క్ష‌వాతానికి గురైన ఓ నిరుపేద జ‌ర్న‌లిస్టు జీవితానికి కొత్త ఆశ‌లు చిగురింప‌జేశాడు. జ‌ర్న‌లిస్టు దుర్గాగౌడ్‌ హెల్త్ కోసం స‌హాయం చేశాడు. ఆయ‌న పిల్ల‌లను చ‌దివించేందుకు 22 ల‌క్ష‌ల విలువైన ఎడ్యుకేష‌న్ అందించేందుకు ముందుకొచ్చాడు. ఏడాది కాలంగా ప‌క్ష‌వాతంతో మంచం ప‌ట్టి చావుబ‌తుల‌కుల‌తో పోరాడుతున్న‌ జ‌ర్న‌లిస్టు దుర్గాగౌడ్ గురించి మేము సైతం ఓ కార్య‌క్ర‌మాన్ని రూపొందించింది. ఈ కార్య‌క్ర‌మంలో గెస్టు సెల‌బ్రెటీగా పాల్గొన్న మంచు విష్ణు.. బాధిత జ‌ర్న‌లిస్టు క‌ష్టాల‌ను విని క‌దిలిపోయాడు. ఒక్క రోజు పానీపూరి అమ్మి త‌న వంతుగా 75,000 రూపాయ‌లు సంపాదించాడు. వాటిని జ‌ర్న‌లిస్టు దుర్గా ఆరోగ్యం కోసం ఆర్థిక స‌హాయం చేస్తూ ఆయ‌న‌ పిల్ల‌లిద్ద‌రికి న‌ర్స‌రీ నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు 22 ల‌క్ష‌ల విలువైన కార్పోరేట్ విద్యను, వారి బాధ్య‌త‌లు చూసుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు.
ఈ భారీ స‌హాయానికి విష్ణుపై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురుస్తోంది. నిజ జీవితంలోనూ గ్రేట్ హీరో అనిపించుకున్న మంచువిష్ణుకు జ‌ర్న‌లిస్టులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మంచుల‌క్ష్మి కూడా త‌న‌వంతుగా ల‌క్ష రూపాయ‌ల సహాయం ప్ర‌క‌టించింది. మొత్తం 1 ల‌క్షా 75 వేల రూపాయల చెక్కును దుర్గాగౌడ్ కుటుంబానికి అందించారు. అంటే దాదాపుగా 24 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ స‌హాయం అందించిన మంచు విష్ణు, మంచు ల‌క్ష్మిల‌కు హ్యాట్సాప్. దొంగాట మూవీ డైరెక్ట‌ర్ వంశీకృష్ణ‌కు స్పెష‌ల్ థ్యాంక్స్ . జ‌ర్న‌లిస్టు దుర్గా జీవితానికి భ‌రోసా అందించేందుకు స‌హాయ ప‌డుతున్న ప్ర‌తి ఒక్క‌రికి జ‌ర్న‌లిస్టులు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేసారు.

More News

జ‌న‌తా గ్యారేజ్ టీజ‌ర్ రిలీజ్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న‌భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది.

సెన్సార్ బోర్డ్ స‌భ్యునిగా ఎంపికైన కృష్ణ అభిమాని

ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ స‌భ్యునిగా హీరో కృష్ణ అభిమాని జె.పి. హుస్సేన‌య్య నియ‌మితుల‌య్యారు. సెన్సార్ బోర్డ్ స‌భ్యునిగా హుస్సేన‌య్య రెండేళ్ల‌ పాటు కొన‌సాగుతారు.

నిరంత‌రం త‌ప‌న ప‌డేవారి కోసం ప‌వ‌న్ అందిస్తున్న‌ కానుక‌

గుంటూరు శేషేంద్ర శ‌ర్మ ర‌చించిన మ‌హా గ్రంధం ఆధునిక మ‌హా భార‌తం. ఈ పుస్త‌కం గురించి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న స్నేహితుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు చెప్ప‌డం... త్రివిక్ర‌మ్ చెప్ప‌డంతో ప‌వ‌న్ ఆధునిక మ‌హా భార‌తం పుస్త‌కాన్ని చ‌దవ‌డం జ‌రిగింది.

వారి కోసం ఛార్మి త్యాగం

ఛార్మింగ్ గాళ్ ఛార్మి పొడుగుగా ఉండే త‌న హెయిర్ ను స‌డ‌న్ గా భుజాల వ‌ర‌కు క‌త్తిరించేసుకున్నారు. ఇంత‌కీ ఎందుకిలా చేసారు..సినిమాలో గెట‌ప్ కోస‌మా అని  అడిగితే..క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్న ఇద్ద‌రు యువ‌తుల‌కు విగ్గు త‌యారు చేయించడం కోసం ఇలా చేసాను అంటున్నారు.

ఆ క్ల‌బ్ లో చేరిన నితిన్

నితిన్, స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మించిన అ ఆ చిత్రం నేటికీ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బడుతోంది.