కండిషన్ పెట్టిన కూతురు.. గడ్డం తీసేసిన మంచు విష్ణు

  • IndiaGlitz, [Thursday,May 27 2021]

హీరో మంచు విష్ణు ఫ్యామిలీ మ్యాన్. ఎల్లప్పుడూ ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతాడు. విష్ణు తరచుగా తన కుటుంబ విశేషాలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంటాడు. తాజాగా విష్ణు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో నెటిజన్లని ఆకట్టుకుంటోంది.

తమ కుటుంబ సభ్యుల మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో విష్ణు ఈ వీడియో ద్వారా తెలియజేశాడు. విష్ణు గత కొన్ని రోజులుగా గడ్డంతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. చాలా ఇష్టపడి విష్ణు గడ్డం పెంచుకుంటున్నాడు. కానీ విష్ణు కుమార్తెకు ఆ గడ్డం అంటే ఇరిటేషన్ వచ్చినట్లు ఉంది.

ఇదీ చదవండి: స్టన్నింగ్ హాట్.. నడుము సొగసుతో మంత్రం వేస్తోంది

అందుకే తాతయ్య మోహన్ బాబుతో ఓ ఒప్పదం కుదుర్చుకుంది. నాన్న కనుక గడ్డం తీసేస్తే నాలుగు వారల పాటు ఆయన చెప్పినట్లు వింటా అని క్యూట్ గా చెప్పింది. నేను గడ్డం తీసేస్తే అరియనా నా మాట వింటుందట. ఎప్పుడూ తను నా మాట వినలేదు. ఓసారి గడ్డం తీసేసి చూద్దాం అని విష్ణు క్లీన్ షేవ్ లుక్ లోకి మారిపోయాడు.

గడ్డం తీశాక విష్ణుని చూసి అతడి పిల్లలంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ క్యూట్ ఎమోషన్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మోహన్ బాబు కూడా పిల్లలతో కలసి సరదాగా గడుపుతున్నారు.