తండ్రైన మంచు విష్ణు
- IndiaGlitz, [Tuesday,January 02 2018]
చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం..లెగసీని తీసుకెళ్లడానికి అబ్బాయిలైతే ఏంటి? అమ్మాయిలైతే ఏంటి అంటూ ఇటీవల మంచు విష్ణు ట్వీట్ చేశాడు. మంచు ఫ్యామిలీ ఎగ్జయిట్మెంట్ జనవరి 1న తీరింది. ఇంతకు ఆ ఎగ్జయిట్మెంట్ ఏంటో చెప్పనక్కర్లేదు. నిర్మాత, హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి అయ్యాడు. విష్ణు సతీమణి విరోనికా ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. మంచు ఫ్యామిలీకి ఈ 2018 తొలిరోజునే ఆనందం దక్కింది. ఇది వరకు విష్ణు, విరోనికా దంపతులకు అరియానా, వివియానా పిల్లలున్నారు.