నైట్ కర్ఫ్యూపై మంచు విష్ణు కామెంట్.. ఓ ఆటాడుకుంటున్ననెటిజన్స్

  • IndiaGlitz, [Saturday,April 10 2021]

కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ లక్షకు పైగా కేసులతో ఆందోళన కలిగిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌ను తేలికగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. వచ్చే నాలుగు వారాలు మరింత క్లిష్టమైనవని చెబుతూ.. ఎప్పటికప్పుడు ప్రజానీకానికి అవగాహనను కల్పిస్తూ వస్తున్నారు. దేశంలోని ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో మరింత తీవ్ర స్థాయిలో కోవిడ్ విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దీంతో అక్కడ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. అలాగే కరోనా విజృంభిస్తున్న పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు.

ఈ నైట్ కర్ఫ్యూపై హీరో మంచు విష్ణు ట్విటర్ వేదికగా కామెంట్ చేశాడు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లిస్తూ.. విష్ణుని ఓ ఆటాడుకుంటున్నారు. ఇంతకీ విష్ణు ఏం ట్వీట్ చేశాడంటే.. ‘‘చాలా రాష్ట్రాలు కోవిడ్ కారణంగా నైట్ కర్ఫ్యూని ప్రకటించాయి. కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే కోవిడ్ విస్తరిస్తుందా? జస్ట్ ఆస్కింగ్’’ అని ప్రశ్నించాడు. దీనికి నెటిజన్లు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. నైట్ కర్ఫ్యూ అనేది పబ్స్, బార్స్, కొన్ని ఎక్స్‌టెంట్ హోటల్స్‌పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కష్టపడి పనిచేసే లేబర్ కడుపులను కొట్టదు అందుకే నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారని ఒక నెటిజన్ రిప్లై ఇచ్చాడు.

‘ఏం చేయాలి మరి.. మాకైతే సొల్యూషన్ తెలియదు. దీంతో పాటు మేము మీలాగే జీవితాన్ని గడపాలి. మాకేమీ బ్యాంకు నిల్వలు లేవు. ప్రతి నెలా పనిచేస్తేనే జీతం వస్తుంది’ అని ఒకరు... ‘ఉన్నోడికేం తెలుసు లేనోడి కడుపు ఘోస’ అని మరొకరు... ‘మీ కుటుంబమంతా ఇలాగే ఆలోచిస్తారా.. మార్నింగ్ టైమ్ నిత్యావసరాలు, డే వర్కర్స్, బిజినెస్, గవర్నమెంట్ సెక్టార్స్ అన్నీ నడుస్తాయి. అవన్నీ మన ఆర్థిక వ్యవస్థకు ఆధారం కాబట్టి వాటిని ఆపలేము. నైట్ లైఫ్ గాదరింగ్స్, పబ్స్, ఫంక్షన్స్‌ని ఆపవచ్చు. ట్వీట్ చేసే ముందు కాస్త ఆలోచించు’ అని మరొకరు.. ‘వాడికి ఈ మాత్రం తెలిస్తే.. రూ.50 కోట్లతో సినిమా తీసి రూ.50 లక్షలు ఎందుకు కలెక్ట్ చేస్తాడు..’ అంటూ ఓ రేంజ్‌లో కామెంట్స్ పెడుతున్నారు.

More News

ఫ్లవర్ ప్రింటెడ్ బికినీతో కెమెరాకు ఫోజులిచ్చిన జాన్వి

ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ సోషల్ మీడియాలో కొన్ని పిక్స్‌ను పోస్ట్ చేసింది.

అదే వేడి, అదే వాడి, అదే పవర్!: ‘వకీల్ సాబ్’కు చిరు రివ్యూ

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మంచి సక్సెస్ టాక్‌తో దూసుకెళుతోంది. సినీ కెరీర్ పరంగానే కాకుండా..

ఈ మూడు లక్షణాలు కన్నించినా కరోనా సోకినట్టేనట..

కరోనా సెకండ్ వేవ్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సరికొత్తగా రూపు మార్చుకుని మరీ ప్రజానీకాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

‘వకీల్ సాబ్’కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం నిన్న(శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

తండ్రి పాలనతో పోలుస్తూ కేసీఆర్‌ను దుయ్యబట్టిన షర్మిల

నేడు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఖమ్మంలో సంకల్ప సభ ఘనంగా జరిగింది. ఈ సభలో షర్మిల తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి