Kannappa : మంచు విష్ణు ‘‘కన్నప్ప’’ ఫస్ట్ లుక్ చూశారా.. సినిమాపై అంచనాలు పెంచేసిందిగా.. !!

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

మంచువారి వారసుడు విష్ణు.. హిట్టు కొట్టి చాలా ఏళ్లే అవుతోంది. ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా ఆయనకు గెలుపు దక్కడం లేదు. ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని తన డ్రీం ప్రాజెక్ట్‌ ‘‘కన్నప్ప’’ను పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శరత్ కుమార్, శివరాజ్ కుమార్, మధుబాల వంటి స్టార్స్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాకు ప్రఖ్యాత యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా పనిచేస్తున్నారు. మైథలాజికల్ మూవీ కావడంతో అప్పట్లో ఆయుధాలు, పోరాటాలు ఎలా వుండేవో ఊహిస్తూ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ అడవుల్లో ‘‘కన్నప్ప’’ సినిమా షూటింగ్ చేస్తున్నారు. మూవీ సెట్స్ పైకి వెళ్లిన నాటి నుంచి ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే వున్నారు. తాజాగా హీరో మంచు విష్ణు పుట్టినరోజు కావడంతో ‘‘కన్నప్ప’’ నుంచి ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

హీరో ముఖం చూపించకుండా శివలింగం బ్యాక్‌డ్రాప్‌లో మంచు విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు వేస్తున్నాడు. వెనుక వున్న శివలింగాన్ని కూడా బాణాలు, జలపాతాలతో డిజైన్ చేశారు. భగవంతుడిని నమ్మని ఓ వేటగాడు.. శివుడికి పరమ భక్తుడిగా ఎలా మారాడన్న అర్ధం వచ్చేలా ఓ సబ్ టైటిల్ కూడా ఇచ్చారు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్‌గా మారడమే కాదు.. ‘‘కన్నప్ప’’ సినిమాపై అంచనాలను సైతం పెంచేసింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

కన్నప్పలో ప్రభాస్ శివుడి క్యారెక్టర్‌లో కనిపించనున్నారట. ఇందుకోసం ఆయన రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచు ఫ్యామిలీతో వున్న స్నేహం కారణంగా ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు.. ప్రభాస్‌కు జోడీగా పార్వతి దేవి పాత్రలో నయనతార కనిపించనున్నారట.

More News

BRS Party: బీఆర్ఎస్ పార్టీదే మళ్లీ అధికారం.. న్యూస్‌టాప్ సర్వేలో స్పష్టం

తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని న్యూస్ టాప్ సర్వే తెలిపింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం నవంబర్ 16 నుంచి 21 మధ్య ఈ సర్వే చేశామని..

ఇకపై తెలంగాణలోనూ తిరుగుతా.. బీసీ సీఎంను చూడాలి: పవన్

తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలతో పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. హనుమకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్

సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య నువ్వానేనా అనే రీతిలో ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కొడంగల్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో

Akbaruddin Owaisi: పోలీసులను బెదిరించడంతో అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో నేతలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ

Chandrababu: సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది..? చంద్రబాబు భవితవ్యంపై సస్పెన్స్..?

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 29 నుంచి రాజకీయ కార్యకలాపాలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.