'ల‌క్కున్నోడు' గా మంచు విష్ణు

  • IndiaGlitz, [Thursday,August 11 2016]

ఈడోర‌కం ఆడోర‌కం స‌క్సెస్ త‌ర్వాత మంచు విష్ణు కామెడి ఎంట‌ర్ టైన‌ర్స్ నే చేయాల‌నుకుంటున్నాడట. అందుక‌నే త‌ను వింటున్న క‌థ‌ల్లో కామెడి ఉండాల‌ని చెబుతున్నాడ‌ని స‌మాచారం. ఈడోర‌కం ఆడోర‌కం త‌ర్వాత మ‌రే విష్ణు సినిమా సెట్స్‌లో లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం గీతాంజ‌లి, త్రిపుర చిత్రాల ఫేమ్ రాజ్‌కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కామెడి ఎంట‌ర్ టైన‌ర్‌లో న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. రీసెంట్‌గా స‌ద‌రు ద‌ర్శ‌కుడు చెప్పిన లైన్ విష్ణుకు న‌చ్చింద‌ట‌. ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నార‌ని టాక్‌. ఈ చిత్రానికి ల‌క్కున్నోడు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.