సినీ రంగ ప్రవేశం చేయనున్న మంచు వారి మూడోతరం

  • IndiaGlitz, [Tuesday,August 08 2017]

విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా 600కి పైగా చిత్రాల్లో న‌టించి మెప్పించిన క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మోహ‌న్‌బాబు త‌ర్వాత మంచు ఫ్యామిలీ నుండి ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌, మంచు విష్ణు, మ‌నోజ్‌లు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. వారి వారి పంథాల్లో రాణిస్తున్నారు. ఇప్పుడు మంచు వారి మూడోత‌రం సినీ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నే వార్త‌లు మీడియా వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్నాయి.

ల‌క్ష్మీ ప్ర‌స‌న్న కుమార్తె విద్యా నిర్వాణ సినిమాల్లో బాల‌న‌టిగా న‌టించ‌నుంద‌ని అంటున్నారు. స్వ‌ప్న‌ద‌త్‌, ప్రియాంక ద‌త్ నిర్మాత‌లుగా నాగాశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సావిత్రి చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో విద్యా నిర్వాణ న‌టించ‌నుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో సావిత్రి పాత్ర‌లో కీర్తిసురేష్‌, జర్న‌లిస్ట్ పాత్ర‌లో స‌మంత క‌నిపిస్తున్నారు. సావిత్రి భర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్నార‌ట‌.