Manchu Manoj:‘‘ అలా బతకడం కంటే చావడానికైనా సిద్ధం ’’.. మనోజ్ ట్వీట్ వైరల్, ఈసారి గట్టిగా ఇచ్చాడుగా
- IndiaGlitz, [Saturday,March 25 2023]
మంచు బ్రదర్స్ మనోజ్, విష్ణుల మధ్య గొడవ నేపథ్యంలో టాలీవుడ్ ఉలిక్కిపడింది. క్రమశిక్షణకు, డిసిప్లిన్‌కు మారుపేరైన మోహన్ బాబు ఇంట్లో ఇలాంటి పరిస్ధితులేంటీ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అన్నదమ్ములిద్దరూ కలిసి కుటుంబ పరువును రోడ్డున పడేయటంతో మోహన్ బాబు సైతం ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, మంచు ఫ్యామిలీతో సన్నిహితంగా వుండే పెద్దలు సమస్యను పరిష్కరించే బాధ్యతను తీసుకున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తప్పులన్నింటినీ అలా చూస్తూ వదిలేయడం కన్నా.. నిజం కోసం పోరాటం చేసి చావడానికైనా సిద్ధమేనంటూ మనోజ్ ఓ ట్వీట్ చేశారు. మరో పోస్ట్‌లో క్రియేటివిటీకి నెగిటివిటీనే శత్రువు అంటూ పెట్టారు. అలాగే ఈ పోస్ట్‌కు బతకండి.. బతకనివ్వండి అంటూ క్యాప్షన్ ఇవ్వడం ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.
సారథి అనే వ్యక్తిపై దాడికి దిగిన విష్ణు :
కాగా.. గురువారం రాత్రి 10 గంటల సమయంలో మోహన్ బాబుకు బంధువైన సారథి అనే వ్యక్తిపై విష్ణు దాడికి దిగాడు. ఆ సమయంలో మనోజ్ అక్కడే వుండటంతో ఈ తతంగాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టారు. ‘‘ఇలా ఇళ్లలోకి చొరబడి తన వాళ్లను, బంధువులను ఇలా కొడుతూ వుంటాడని.. ఇది సిచ్యుయేషన్’’ అంటూ మనోజ్ రాశారు. మరోవైపు అన్నాదమ్ముల మధ్య గొడవ నేపథ్యంలో మోహన్ బాబు స్పందించారు. సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కారంటూ కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి సూచన మేరకు మనోజ్ సదరు వీడియోను ఎఫ్‌బీ నుంచి డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు సహజమేనని.. ఇద్దరి మధ్యా సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నానని మోహన్ బాబు ఓ ఛానెల్‌తో అన్నట్లుగా తెలుస్తోంది.
ఘనంగా మంచు మనోజ్- మౌనిక వివాహం:
ఇదిలావుండగా.. ఈ నెల 3న మంచు మనోజ్- మౌనిక వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. మంచు లక్ష్మీ ఇంట్లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భార్యను ముద్దాడుతూ మనోజ్ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. కొత్త జంట చూడముచ్చటగా వుంది. గోల్డ్ కలర్ పట్టు కుర్తా, దోతిలో మంచు మనోజ్.. ఆకుపచ్చ, పింక్ కలర్ పట్టుచీరలో మౌనిక ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం మనోజ్-మౌనికా రెడ్డిల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Live and let live 🙏🏼❤️ Love you all with all my heart. #ManchuManoj pic.twitter.com/ypecRuZwLG
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 25, 2023