Manchu Manoj:ఇక దాపరికలు లేనట్లేనా.. భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి ఫిక్సేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నారా అంటూ గత కొన్నినెలలుగా సోషల్ మీడియా, మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బలమైన రాజకీయ కుటుంబాల్లో ఒకటైన భూమా ఫ్యామిలీకి ఆయన అల్లుడు కాబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. గతేడాది హైదరాబాద్ నగరంలోని సీతాఫల్ మండిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్దకు మంచు మనోజ్ వచ్చారు. ఆయనొక్కరే వచ్చుంటే ఏముండేది కాదు.. కానీ మనోజ్ వెంట దివంగత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనిక రెడ్డి రావడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో మనోజ్- మౌనికా రెడ్డిలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ మీడియా కోడై కూస్తోంది. ఆ తర్వాత చాలా వేదికలపై వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ దీనిపై ఇరు కుటుంబాలు కానీ, మనోజ్- మౌనికాలు కానీ స్పందించలేదు. అలాగే మనోజ్ సోదరి మంచు లక్ష్మీ సైతం ఈ విషయం గురించి తనకు ఎలాంటి సమాచారం తెలియదని తేల్చేశారు.
మార్చి 3న మనోజ్ పెళ్లి :
ఇదిలావుండగా.. మీడియా మాత్రం మనోజ్ సెకండ్ మ్యారేజ్ గురించి ఫోకస్ చేస్తూనే వుంది. తాజాగా ఆయన పెళ్లి గురించి ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. మనోజ్-భూమా మౌనికల పెళ్లి మార్చి 3న జరగనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు ఆ కథనాల సారాంశం. తమ్ముడి పెళ్లి ఏర్పాట్లలో మంచు లక్ష్మీ బిజీగా వున్నారట. కానీ దీనిపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మీడియా మాత్రం హాట్ హాట్ కథనాలను వండి వారుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం వుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
ప్రణతితో విడాకుల తర్వాత ఒంటరిగానే మనోజ్:
కాగా.. మంచు మనోజ్ తొలుత ప్రణతి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట 2019లో విడాకులు తీసుకుంది. ఆనాటి నుంచి మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నోసార్లు మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ గాలి వార్తలేనని తేలిపోయింది. కానీ ఇప్పుడు తాజా ఘటన వెనక కథేంటో అర్ధం కావడం లేదు. ఇక భూమా మౌనికా రెడ్డి విషయానికి వస్తే, ఇమెకు కూడా ఆల్రెడి పెళ్లయ్యింది. బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో మొదటి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఐదేళ్ల బాబు కూడా వున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ దంపతులు రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. గణేష్ నుంచి వీడిపోయాక.. మౌనికా రెడ్డి హైదరాబాద్‌లోనే వుంటున్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments