మనోజ్‌కి ఆరు నెలలు రెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మనోజ్ హీరోగా రేపు రిలీజ్ కాబోతున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ "ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, రొమాన్స్, కామెడీ ఏ విధమైన హంగులు లేని సినిమా. డైరెక్టర్ అజయ్ నాకు ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పిన వెంటనే ఎంతో బాధ్యతగా చేయాలనిపించి మనస్పూర్తిగా ఒప్పుకున్నాను. ఎల్.టి.టి.ఈ చీఫ్ ప్రభాకరన్ గురించి చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత స్క్రిప్ట్ రాసుకున్నాడు అజయ్. అలాగే ఈ సినిమా కోసం కొంచెం బరువు కూడా పెరగాల్సి వచ్చింది".
షూటింగ్ లో జరిగిన కొన్ని ప్రమాదాలకి నేచురల్ గా తగ్గటానికి కొంత సమయం రెస్ట్ తీసుకున్నాను గాని.. ఏ విధమైన ఆపరేషన్స్ జోలికి కూడా వెళ్ళలేదు. సెకండాఫ్ లో వచ్చే వాటర్ చేజింగ్ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో నటించిన నటీనటుల్లో చాలా వరకు కొత్తవారైనా.. ఎంతో కష్టపడి పనిచేశారని మనోజ్ కితాబిచ్చాడు.
తను చేయబోయే తదుపరి మూవీ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు మనోజ్. రాబోయే ఆరు నెలల్లో ఎటువంటి సినిమాకి తాను సైన్ చేయడం లేదని.. అయితే తన ఫ్రెండ్స్ అజయ్ శాస్త్రి, శరవణన్ కలిసి కథని అందించే కొత్త ప్రాజెక్ట్.. వచ్చే ఏప్రిల్ లో కొత్త డైరెక్టర్ చంద్రతో ఉంటుందని చెప్పుకొచ్చాడు మనోజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com