ప్రత్యేక హోదాకు మనోజ్ మద్ధతు...

  • IndiaGlitz, [Tuesday,January 24 2017]

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌త్యేక హోదా కోసం పిలుపునివ్వ‌గానే సినీ రంగం నుండి పలువురు యంగ్ హీరోస్ త‌మ వంతుగా స‌పోర్ట్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. ఇండ‌స్ట్రీ నుండి సాయిధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్, సందీప్ కిష‌న్, సంపూర్ణేష్ బాబు, శివ బాలాజీ, నిఖిల్, త‌నీష్, ర‌ఘు కుంచె, గోపీచంద్ మ‌లినేని త‌దిత‌రులు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ మ‌ద్ద‌తు తెలియ‌చేయ‌డ‌మే కాకుండా వీరంతా కూడా ప్ర‌త్యేక హోదా కోసం తెలుగు ప్ర‌జ‌లంద‌రూ మ‌ద్ద‌తు తెలియచేసి జ‌న‌వ‌రి 26న జ‌రిగే నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనాలి అంటూ త‌మ అభిప్రాయాన్ని తెలియ‌చేశారు.

ఇప్పుడదే బాట‌లో హీరో మంచు మ‌నోజ్ కూడా త‌న స‌పోర్ట్‌ను తెలియ‌జేశాడు. ఈ జ‌న‌వ‌రి 26న జ‌ర‌గ‌నున్న త‌న గుంటూరోడు సినిమా ఆడియో విడుద‌లను వాయిదా వేసుకున్నాడు. యుద్ధం ప్రేమ‌ను చంప‌దు, కానీ ప్రేమ యుద్ధాన్ని చంపుతుందంటూ ప్రత్యేక హోదా కోసం పిలుపునిచ్చాడు. మ‌రి ఇంకెంత మంది హీరోలు ప‌వ‌న్‌కు అండ‌గా నిల‌బ‌డ‌తారో చూడాలి.