నిజంగానే డిఫరెంట్ మూవీ శౌర్య - మనోజ్
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు మనోజ్ - రెజీనా జంటగా దశరథ్ తెరకెక్కించిన చిత్రం శౌర్య. ఈ చిత్రాన్ని సురక్ష ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శివకుమార్ నిర్మించారు. థ్రిల్లింగ్ లవ్ స్టోరీగా రూపొందిన శౌర్య ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో హీరో మనోజ్ మాట్లాడుతూ...కమర్షియల్ ఫార్మెట్ లో తీసిన థ్రిల్లింగ్ లవ్ స్టోరి ఇది. డిఫరెంట్ మూవీ చేయాలని టీమ్ అంతా కలసి ఈ సినిమా చేసాం. డిఫరెంట్ మూవీ అని అందరూ చెబుతారు కానీ...నిజంగానే డిఫరెంట్ మూవీ ఇది. శౌర్య సినిమా చూసిన తర్వాత ఆడియోన్స్ కి కొత్తసినిమా చూసామన్నా ఫీల్ కలుగుతుంది. రాజకీయాలు వేరు - సినిమాలు వేరు. సినిమాని క్యాస్ట్ ఫీలింగ్ తో చూడకండి. డ్రగ్స్ కి క్యాస్ట్ కి దూరంగా ఉండండి. ఈ సినిమాకి వేద సూపర్ గా రీ రికార్డింగ్ అందించాడు అన్నారు.
హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ...కథ చెప్పిన వెంటనే ఖచ్చితంగా ఈ సినిమా చేయాలి అనిపించింది. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అన్నారు.
డైరెక్టర్ దశరథ్ మాట్లాడుతూ...కాన్సెప్ట్ బేస్డ్ స్టోరి ఇది. కొత్త సినిమాలని ఆదరిస్తున్న ఈరోజుల్లో మా శౌర్య ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.
శివారెడ్డి మాట్లాడుతూ...దశరథ్ సినిమా అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎలా చూపిస్తారో తెలిసిందే. ఫ్యామిలీస్ తో పాటు యూత్ కి నచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బ్రహ్మానందం, ప్రభాస్ శ్రీను, నేను చేసిన కామెడీ ప్రేక్షకలను నవ్విస్తుంది. అందరి మనసులను శౌర్య దోచుకుంటుంది అన్నారు.
నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ...మనోజ్ కెరీర్ లోశౌర్య డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది. మనోజ్, రెజీనా, ప్రకాష్ రాజ్, బ్రహ్మోనందం...ఇలా క్యారెక్టర్స్ కి న్యాయం చేసేవాళ్లనే ఎంచుకున్నాం. మోహన్ బాబు గారు ఈ సినిమా చూసి మనోజ్ కి ఈ సినిమాతో మంచి హిట్ వస్తుంది. అలాగే సురక్ష బ్యానర్ విలువ మరింత పెరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వేద, స్ర్కీన్ ప్లే రైటర్ కిషోర్ గోపీ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments