నెటిజన్ల మండిపాటు.. మనోజ్ సంచలన ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు సంబంధించిన విద్యానికేతన్ విద్యాసంస్థల ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తమ కాలేజీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఇటీవల కాలేజీ విద్యార్థులతో మోహన్ బాబు ధర్నాకు దిగారు. నాటి నుంచి తెలుగు తమ్ముళ్లు.. మంచు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక విషయానికొస్తే.. ఓ టీడీపీ కార్యకర్త చేసిన ఆరోపణలపై మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ కామెంట్ కాస్త కఠినంగానే ఆయన స్పందించారు. అయితే మనోజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదమవ్వడంతో పలువురు నెటిజన్లు కన్నెర్రజేశారు. ఈ నేపథ్యంలో మనోజ్ ఓ ప్రకటనను విడుదల చేశారు.
మనోజ్ మాటల్లోనే...
‘అందరికీ ఓ చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ పార్టీలకు అతీతంగా ప్రజల కోసం నిలబడాలనుకునే మనిషిని. ఒక మనిషికి సాయం చేసేటప్పుడు తన కష్టం తప్ప కులం, మతం చూడకూడదని పూర్తిగా నమ్మే మనిషిని. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం చేసిన దీక్షకి మద్దతుగా నేను నిలబడింది పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్న ఉద్దేశంతోనే. ఎటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం కాదని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను.
నేను చంద్రబాబు గారి పార్టీ మనిషిపైన కఠినంగా స్పందించింది కేవలం ఆయన మా కాలేజీపై మోపిన తప్పుడు ఆరోపణల వల్ల తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అది మా నాన్నగారు కష్టార్జితంతో ఎన్నో ఒడిదుడికులను ఎదుర్కొని కాలేజీ. ఆ రోజు రోడ్డు మీద మా నాన్నతో నడిచింది.. ఒక పెద్ద మనిషిపై తీవ్రంగా స్పందించింది కేవలం మా పిల్లలకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో మాత్రమే.
ఈ మంచు మనోజ్, రాజకీయ పార్టీలకి అతీతంగా ప్రజాసేవకి ఎప్పుడూ ముందుంటాడని, పదిమందికి మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ ఏ పార్టీ తలపెట్టినా దానికి తాను మద్దతుగా నిలబడతాడని, అలాగే ప్రజలకు అన్యాయం చేసే ఏ పార్టీనైనా నిలదీస్తాడని సవినయంగా మనవి చేసుకుంటున్నాను" అని మనోజ్ ప్రకటనలో పేర్కొన్నారు.
Rajakeeya prayojanala kosam road ekkaledu..
— MM*????❤️ (@HeroManoj1) March 26, 2019
Manchini panchadaniki mathamo, kulamo addu pettukonakkarledu..
Idi Nenu..Idi Nijam..
Na Peru Manoj Manchu, Na manasulo unnadi meeku cheppukuntunnanu?? pic.twitter.com/pUMVA4ktGm
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout