మా ఎన్నికలు... ఆ ఒక్కడు అన్నయ్యని టార్గెట్ చేశాడు : మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడు, యువ హీరో మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ విద్యానికేతన్ 30వ వార్షికోత్సవం సందర్భంగా తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో మనోజ్ మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో కావాలనే తన అన్నయ్య విష్ణును కొందరు టార్గెట్ చేశారంటూ వ్యాఖ్యానించారు. గొప్ప వ్యక్తుల మధ్య ఉన్నప్పటికీ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మనోజ్ మండిపడ్డారు.
పోటీ అంటే ఇరు వైపులా ఉంటుందని... ఇటువైపు , అటువైపు వాళ్లూ ఓట్లు వేయమని కోరారని ఆయన గుర్తుచేశారు. సభ్యులందరూ కలిసి.. ఫలానా వ్యక్తి ప్రెసిడెంట్‌గా ఉంటే బాగుంటుందని భావించి మా అన్నయ్యని గెలిపించారని మనోజ్ తెలిపారు. పరిశ్రమలో అందరి మధ్య మంచి అనుబంధం ఉందని, అందరం స్నేహితులమేనని ఆయన చెప్పారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రతిసారీ మా అన్నయ్యని టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బందిపెట్టాలని చూశాడంటూ మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఆ మాటల్ని పట్టించుకోలేదని.. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆ వ్యక్తి మాకు సపోర్ట్ చేసే వాళ్లని అసభ్యకరమైన మాటలతో ఇబ్బంది పెడ్టాడని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ వ్యక్తికి జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదని... అందుకే అలా ప్రవర్తిస్తున్నాడని, అలాంటి వాళ్ల గురించి పట్టించుకోకు అని నాన్న చెప్పిన మాటలు నిజమేనని అనిపించాయన్నారు. ఇప్పుడు మనోజ్ వ్యాఖ్యలు తెలుగు చిత్ర సీమలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ మంచు విష్ణుని టార్గెట్ చేసిన వ్యక్తి ఎవరా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com