మంచు మనోజ్ రెండో పెళ్లి ?

  • IndiaGlitz, [Sunday,March 07 2021]

టాలీవుడ్ క‌థానాయ‌కుడు మంచు మ‌నోజ్ పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు నెట్టింట హ‌ల్ చల్ చేస్తున్నాయి. 2015లో ప్ర‌ణ‌తి రెడ్డిని మ‌నోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో వారిద్ద‌రూ విడిపోయారు. కొన్నిరోజులుగా సినిమాల‌తో బిజీగా ఉన్న మ‌నోజ్‌, త్వ‌ర‌లోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్త‌లు వినిపించాయి. అది కూడా ఓ హీరోయిన్‌ని అంటూ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అయితే మ‌నోజ్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుండాడ‌నే వార్త‌ల్లో నిజం లేద‌ట‌. మోహ‌న్‌బాబు త‌న కుటుంబానికి ద‌గ్గ‌రి బంధువైన అమ్మాయితో మ‌నోజ్ పెళ్లి చేయ‌బోతున‌ట్లు టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను కూడా త్వ‌ర‌లోనే ఇస్తారట‌.

మ‌నోజ్, ప్ర‌ణ‌తిరెడ్డి మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో విడాకులు తీసుకున్నారు. మ‌న వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో మూడేళ్ల నుంచి మ‌నోజ్ సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. విడాకుల విష‌యాన్ని మ‌నోజ్ స్వ‌యంగా తెలియ‌జేశారు. అదే స‌మ‌యంలో తాను ఇక‌పై వ‌రుస సినిమాలు కూడా చేస్తున్న‌ట్లు తెలిపారు మ‌నోజ్‌. అందులో భాగంగా ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీ అహం బ్ర‌హ్మాస్మి అనే సినిమాలో న‌టిస్తున్నారు మ‌నోజ్‌.

More News

త‌ప్పుడు వార్త‌లు రాయొద్దంటూ అషూరెడ్డి వార్నింగ్‌

కొన్ని రోజుల ముందు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఆయ‌న అభిమాని అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆషూ రెడ్డి క‌లిసింది. ఆఫొటోను సోష‌ల్ మీడియాలో చేసింది. అయితే దీనిపై ...

షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన్ను వెతికి పట్టుకున్నా: నాగ్ అశ్విన్

‘మహానటి’తో తెలుగు సినిమాను జాతీయస్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌. ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘జాతి రత్నాలు’. అనుదీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

సాయిరాం శంకర్ హీరోగా 'బంపర్ ఆఫర్ - 2'

ఓ చిత్రం విజయం సాధిస్తే దానికి సీక్వెల్ చేయటం ఓ పద్ధతి. అదే చిత్రం పేరును కొనసాగిస్తూ కొత్త కథను తెరకెక్కించడం మరో పద్ధతి. ఇప్పుడీ రెండో పద్దతిలోనే ఓ చిత్రం ఈరోజు పురుడు పోసుకుంది.

మళ్లీ చేతికి పని చెప్పిన బాలయ్య.. టచ్‌‌తో హ్యాపీ అంటున్న యువకుడు

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఓ యువకుడిపై చేయి చేసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

మహేష్ కొత్త కారవాన్.. ప్రత్యేకతలివే..

చిన్ననాటి నుంచి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ హీరో శర్వానంద్ మంచి స్నేహితులు. చదువుకునే రోజుల్లో ఏర్పడిన ఈ స్నేహం నేటికీ కొనసాగుతోంది. ఇద్దరూ ఒకే రంగంలోకి ప్రవేశించారు.