మంచు మనోజ్ రెండో పెళ్లి ఎప్పుడంటే?

  • IndiaGlitz, [Friday,February 12 2021]

మంచు వారబ్బాయి త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అతను పెళ్లి చేసుకొబోయే అమ్మాయి మోహన్‌బాబు కుటుంబానికి దగ్గర బంధువు అని తెలుస్తోంది. మే నెల 17న కానీ 18న కానీ ఈ వివాహాం జరగనున్నట్లు సమాచారం. మనోజ్‌కి 2015లో ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది. వీరిద్దరిదీ ప్రేమ పెళ్లి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ప్రణతి-మనోజ్‌ల పరిచయం జరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

మనోజ్, ప్రణతిల పెళ్లికి మోహన్‌బాబుతో పాటు కుటుంబ సభ్యులు అంగీకరించలేదట. అయినప్పటికీ మనోజ్ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నట్టు తెలుసతోంది. ఏడాది పాటు వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరూ 2019లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాలపై దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది. సొంతంగా నిర్మాణ సంస్థను మొదలుపెట్టి సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే మోహన్‌బాబు తన చిన్న కుమారుడికి మరో వివాహం చేయాలని డిసైడ్ అయ్యారట.

ఇక సినిమాలపైనే మంచు మనోజ్ దృష్టి పెట్టాడు. ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత మనోజ్ మళ్లీ సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ తీసుకున్న అనంతరం ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు మంచు మనోజ్ సిద్ధమవుతున్నాడు. అందులో ఒకటి వెబ్ సిరీస్ అనుభవం ఉన్న దర్శకుడితో చేయబోతున్నాడని సమాచారం. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థే రూపొందించబోతోందని టాక్. ప్రణతితో విడాకుల అనంతరం మనోజ్‌కు సినిమాలే ప్రపంచంగా మారినట్టు తెలుస్తోంది.

More News

నోటికి పనిచెప్పిన కొడాలి నాని.. షాకిచ్చిన ఎస్‌ఈసీ

మంత్రి కొడాలి నాని మరోసారి నోటికి పని చెప్పారు. ఎన్నికల కమిషన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

శంకర్, రామ్ చరణ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ ఫిక్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రానికి ఏర్పాట్లన్నీ పూర్తైనట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని సమాచారం.

అవన్నీ నిరాధారమైన ఆరోపణలు: ఎన్టీవీ

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గర నుంచి ఫేక్ న్యూస్‌లకు ఏమాత్రం కొదవ లేకుండా పోతోంది.

ఇద్దరు తెలుగు స్టార్ హీరోలపై దృష్టి సారించిన బాలీవుడ్?

బాలీవుడ్ ఇండస్ట్రీ ముఖ్యంగా ఇద్దరు తెలుగు స్టార్స్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

100 వాహనాలు ఒకదానికొకటి ఢీ.. ఐదుగురి మృతి

ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 100 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.